జక్కన్న ఏంటన్నా అంటున్న ఫ్యాన్స్

0

తమ అభిమాన హీరో సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు ఫ్యాన్స్. అదే ఆ హీరో నుండి ఓ ఏడాది పైనే సినిమా రాకపోతే ఎదురుచూపులు ఇంకా ఎక్కువగా ఉంటాయి. సరిగ్గా ఇప్పుడు ఫస్ట్ లుక్ కోసం అదే రేంజ్ లో వెయిట్ చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. అవును ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ స్టార్టై చాలా నెలలు అయినా ఇంత వరకూ ఏ ఒక్క హీరో ఫస్ట్ లుక్ రిలీజ్ చేయలేదు.

అందుకే ‘ఆర్ ఆర్ ఆర్’ నుండి తారక్ ఫస్ట్ లుక్ ఎప్పుడా అని పడిగాపులు కాస్తున్నారు ఫ్యాన్స్. లేటెస్ట్ గా ట్విట్టర్ లో రాజమౌళి ని ట్యాగ్ చేస్తూ తారక్ బర్త్ డే వస్తుంది ఫస్ట్ లుక్ వదలండి అంటూ సంకేతాలు ఇస్తున్నారు. అంతే కాదు #100DaysToNTRsFestival అనే హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి మరీ ఆ రోజు ఫెస్టివల్ చేసుకుంటున్నాం అని జక్కన్న కి తెలియజేస్తున్నారు.

అయితే సినిమా నుండి ఇప్పటికే ఫస్ట్ లుక్స్ రిలీజ్ అవ్వాలి. కానీ సినిమా సంక్రాంతి కి పోస్ట్ పోన్ కావడంతో ఇప్పటి నుండే ప్రమోషన్స్ ఎందుకని ఆలోచిస్తున్నారు. కానీ మేలో ఎన్టీఆర్ బర్త్ డే కి మాత్రం ఫస్ట్ లుక్ వదలడం ఖాయం లేదంటే తారక్ ఫ్యాన్స్ ‘ఆర్ ఆర్ ఆర్’ మేకర్స్ మీద విరుచుకుపడటం ఖాయం. ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ తర్వాత మెల్లగా చరణ్ లుక్ వదులుతారనే టాక్ ఉంది. లేదంటే చరణ్ తో ఎన్టీఆర్ కలిసిన స్టిల్ తోనే తారక్ కి బర్త్ డే విషెస్ చెప్పే అవకాశం కూడా ఉంది.