లైఫ్ లో మర్చిపోలేని గిఫ్ట్ ఇస్తా.. చరణ్: ఎన్టీఆర్

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. రేపు రాంచరణ్ పుట్టినరోజు సందర్బంగా ఏదో ప్రత్యేకమైన గిఫ్ట్ ఇవ్వడానికి ప్లాన్ చేసాడట. కరోనా వలన లాక్ డౌన్ లో ఉండిపోయిన కారణంగా ఇప్పటికే ఫ్యాన్స్ ని సెలెబ్రేషన్స్ చేయకండి అని పిలుపునిచ్చాడు రాంచరణ్. ఇలాంటి టైమ్ లో సెలెబ్రేషన్స్ కరెక్ట్ కాదని చెప్పి అందరినీ ఇంట్లోనే ఉండాలని తెలిపాడు. అయితే ఇప్పటికే హీరోయిన్ కాజల్ అగర్వాల్ చేత ట్విట్టర్ లో రాంచరణ్ పై ఫ్యాన్స్ ఒక స్పెషల్ సాంగ్ రిలీజ్ చేసారు.

తాజాగా తన స్నేహితుడు సహనటుడు ఎన్టీఆర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘బ్రదర్ మనం లాక్ డౌన్ లో ఉన్న కారణంగా నీ పుట్టినరోజు వేడుకను సరిగ్గా జరపలేకపోతున్నాం. కానీ లాక్ డౌన్ పరిస్థితుల్లో మనం ఇళ్లలో ఉండటమే ముఖ్యం. అందుకే రేపు ఉదయం 10గంటలకు నీకోసం డిజిటల్ గిఫ్ట్ ఇస్తాను అది నీ జీవితంలో మర్చిపోలేనిదిగా నిలిచిపోతుందని..’ ట్వీట్ చేసాడు. అంతే నెట్టింట అభిమానులకు కుతూహలం మొదలైంది. ఎన్టీఆర్ రాంచరణ్ కి ఏం గిఫ్ట్ ఇస్తాడో అది ఎలా ఉండబోతుందో.. అంతటి స్పెషల్ గిఫ్ట్ ఏమై ఉంటుందబ్బా.. అని ఆలోచనలతో తలమునకలు అవుతున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-