సల్మాన్ తో ఒకే ఫ్రేమ్ లో చరణ్ – తారక్

0

దబాంగ్ స్టార్ సల్మాన్ తో కలిసి ఒకే వేదికపై ఆర్.ఆర్.ఆర్. స్టార్లు రామ్ చరణ్- ఎన్టీఆర్ డ్యాన్సులతో షేక్ చేసే వీలుందా? అంటే అందుకు ఛాన్స్ లేకపోలేదనే భావిస్తున్నారు. ఆ ముగ్గురు టాప్ స్టార్లను ఒకే వేదికపై ఒకే ఫ్రేమ్ లో అభిమానులు వీక్షించే అరుదైన అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇదేదీ అధికారికంగా ఎలాంటి కన్ ఫర్మేషన్ లేని వార్త. ప్రస్తుతానికి ఇది స్పెక్యులేషన్ మాత్రమే.

ఇంతకీ సంగతేంటి? అంటే.. సల్మాన్ భాయ్ ప్రతియేటా `దా-బాంగ్` టూర్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా డ్యాన్స్ టూర్లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి హైదరాబాద్ లో `దబాంగ్ 3` టీమ్ అడుగు పెడుతోంది. ఇక్కడ గచ్చిబౌళి స్టేడియంలో భారీ ఈవెంట్ ని `దబాంగ్ 3` బృందం ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమంలో సల్మాన్ – సోనాక్షి- ప్రభుదేవా టీమ్ తో జాక్విలిన్ ఫెర్నాండెజ్ – డెయిసీ షా తదితరులు పాల్గొంటున్నారు.

అయితే ఇదే వేదికపై ఆర్.ఆర్.ఆర్ స్టార్లు ఎన్టీఆర్- చరణ్ కూడా స్టెప్పు కలిపే వీలుందని భావిస్తున్నారు. సల్మాన్ కి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఎంత సన్నిహితుడో తెలిసిందే. చరణ్ తో పాటు మెగా ఫ్యామిలీ ఈ ఈవెంట్లో పాల్గొనే ఛాన్సుంది. అలాగే వీళ్లతో పాటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం ఈ ఈవెంట్ కి ఎటెండ్ అవుతారని అంతా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ – ఎన్టీఆర్ కథానాయకులుగా ఆర్.ఆర్.ఆర్ సెట్స్ పై ఉంది. ఇంకా దా-బాంగ్ టూర్ కి మరో రెండు నెలల సమయం ఉండనే ఉంది కాబట్టి అప్పటికి ఈ వేదికపై ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్ ని ప్లాన్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. మొత్తానికి కారణం ఏదైనా అటు దబాంగ్ స్టార్లతో ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్ అంటే ఆసక్తిని రేకెత్తించేదే.
Please Read Disclaimer