NTR 31 .. ఆ దర్శకుడితో ఫిక్సయినట్టే

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి త్రివిక్రమ్ కంటే ముందే కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తాడని భావించినా అది కాస్తా షెడ్యూల్ లో వెనక్కి వెళ్లింది. ఇక ఆ ఇద్దరితో పాటు తమిళ దర్శకుడు అట్లీ.. కొరటాల శివ సినిమాలకు తారక్ ఓకే చెప్పాడు. కేవలం అగ్ర దర్శకులతోనే కాదు.. పెళ్లి చూపులు ఫేం తరుణ్ భాస్కర్ చెప్పిన ఒక కథను లాక్ చేశాడని ఇటీవల ప్రచారమైంది.

తాజా సమాచారం ప్రకారం.. త్రివిక్రమ్ సినిమాని 2021 ప్రథమార్థంలో రిలీజ్ చేస్తారు. ఇందులో తారక్ ఓ రాజకీయ నాయకుడిగా కనిపిస్తారని.. `అ` సెంటిమెంటుతో టైటిల్ ని ఎంపిక చేయనున్నారని ప్రచారమవుతోంది. ఈ మూవీ పూర్తయిన వెంటనే కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ తో సినిమాని పట్టాలెక్కించేందుకు తారక్ సిద్ధంగా ఉన్నాడట. ఇప్పటికే ప్రశాంత్ నీల్ మూడు నాలుగు సార్లు తారక్ ని హైదరాబాద్ లోనే కలిసి స్క్రిప్టును వినిపించాడు. ఆల్మోస్ట్ ఈ ప్రాజెక్టుకి తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని… దీనిని పాన్ ఇండియా కేటగిరీలో తెరకెక్కించేందుకు అత్యంత భారీ బడ్జెట్ ని వెచ్చించనున్నారని తెలుస్తోంది.

ఈ మూవీని ప్రతిష్ఠాత్మక మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. ప్రస్తుతం కేజీఎఫ్ 2 చిత్రీకరణలో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్.. ఈ ప్రాజెక్ట్ పూర్తి కాగానే తారక్ సినిమా ప్రీప్రొడక్షన్ పైనే పూర్తిగా దృష్టి సారిస్తారు. ఈలోగానే తారక్ తన ఆన్ సెట్స్ ప్రాజెక్టును పూర్తి చేసుకుని రెడీ అవుతారని చెబుతున్నారు. ఇక ప్రశాంత్ నీల్ ఎంచుకున్న కథాంశం ఎలాంటిది? అంటే.. అది భారీ పీరియాడికల్ యాక్షన్ సినిమా అని తెలుస్తోంది. నాలుగైదు భాషల్లో రిలీజవుతుంది కాబట్టి అందుకు తగ్గట్టే భారీ కాన్వాసుపై తెరకెక్కించాలన్న ప్లాన్ ఉందిట.




Please Read Disclaimer