#RRR మన్యం వీరులు ఇలాంటి లుక్?

0

దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ చిత్రాన్ని పాన్ ఇండియా కేటగిరీ లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 2020లో రిలీజవుతున్న మొట్ట మొదటి సౌత్ పాన్ ఇండియా చిత్రమిదే. జూలై 31 తేదీని లాక్ చేసిన సంగతి తెలిసిందే. డెడ్ లైన్ ప్రకారం చిత్రీకరణ పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం విశాఖ మన్యం లో చరణ్ – తారక్ బృందం పై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు.

అయితే స్పాట్ నుంచి ఇటీవల కొన్ని పోటోలు సామాజిక మాధ్యమా ల్లో జోరుగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. తారక్ విశాఖ విమానాశ్రయంలో దిగినప్పటి ఫోటోలు.. అటుపై చరణ్ తో కలిసి ఉన్న ఫోటోలు లీకయ్యాయి. తాజాగా ఎన్టీఆర్ -చరణ్ కలిసి ఉన్న ఫోటో ఒకటి రివీలైంది. ఈ ఫోటోలో ఫ్యాన్ మూవ్ మెంట్ ఆకట్టుకుంటోంది.

అదంతా సరే కానీ.. ఈ ఫోటోని జాగ్రత్త గా పరిశీలిస్తే స్వాతంత్య్రానికి ముందే తెలుగు యువత మరీ ఇంత మోడ్రన్ గా ఉన్నారా? ఇది నాటితరం లుక్ ని ప్రతిబింబిస్తుందా? అంటూ సందేహం కలగొచ్చు. పైగా చరణ్ ఆంధ్రా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గా నటిస్తుండగా.. ఎన్టీఆర్ తెలంగాణ గిరిజన వీరుడు కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. అప్పట్లో అల్లూరి సీతారామరాజు యువకుడిగా ఉండేప్పుడు కోరమీసం తిప్పేవారన్న ఆధారం తప్ప వేరే ఇంకేదీ ఆ లుక్ కి సరిపోవడం లేదు. ఇక తారక్ సైతం కాస్త మోడ్రన్ యాటిట్యూడ్ తోనే కనిపిస్తున్నాడు. అయితే ఈ ఫోటోలో ఉన్నది పాత్రలకు సంబంధించిన లుక్ కాదు. కేవలం క్యాజువల్ గా ఉన్నదేనని భావించాల్సి ఉంటుందేమో! అయితే ఇలాంటి డైలమాలన్నిటికీ చెక్ పెట్టాలంటే తారక్ – చరణ్ పాత్రల లుక్ ఎలా ఉండనుంది? అన్నది జక్కన్న రిలీజ్ చేయాల్సి ఉంటుంది. 2020 జనవరి 1న అలాంటి ట్రీట్ ఏదైనా ఉంటుందేమో చూడాలి.




Please Read Disclaimer