సూరి కామెంట్ ని లైట్ తీస్కున్న తారక్

0

`సైరా- నరసింహారెడ్డి` లాంటి పాన్ ఇండియా సినిమాతో సురేందర్ రెడ్డి పేరు మార్మోగింది. కెరీర్ లో రేసుగుర్రం- ధ్రువ లాంటి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టి దూకుడు మీద ఉన్న సురేందర్ రెడ్డిని పిలిచి మరీ అవకాశం ఇచ్చారు చిరు-చరణ్ బృందం. బాస్ కి ఇచ్చిన మాటను నిలబెట్టాడన్న ప్రశంసలు దక్కాయి. సైరా పాజిటివ్ టాక్ నేపథ్యంలో సురేందర్ రెడ్డి వరుసగా మీడియా చానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఎంతో హుషారుగా కనిపించారు.

అయితే ఆ హుషారులోనే పాత ఫ్రస్టేషన్ ని బయటికి తీసి కొత్త కామెంట్ చేయడంతో అది కాస్తా వివాదానికి దారి తీసింది. ఎన్టీఆర్ తో రెండు సినిమాలు చేసిన సురేందర్ రెడ్డి అందులో ఒక సినిమాని తారక్ మేనేజర్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడం వల్ల బలవంతంగా చేయాల్సి వచ్చిందని అన్నాడు. ఎన్టీఆర్ హీరోగా సురేందర్ రెడ్డి తెరకెక్కించిన అశోక్ డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా ఊసర వెల్లి రూపంలో తారక్ మరో అవకాశం ఇచ్చాడు. అయితే అది కూడా సేమ్ రిజల్ట్ నే ఇచ్చింది. అయితే ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కాని సందర్భంలోనూ అలాంటి ఫలితమే వచ్చింది కదా! నమ్మి అవకాశం ఇస్తే ఇలా అంటాడా! అంటూ సోషల్ మీడియాల్లో తారక్ ఫ్యాన్స్ సీరియస్ అయ్యారు. సురేందర్ రెడ్డిపై ఒక రకంగా చెలరేగిపోయారు.

ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన క్లిప్పింగులు తారక్ ముందుకు చేరిపోవడంతో ఆర్.ఆర్.ఆర్ సెట్స్ లో దీనిపై చర్చ సాగింది. అయితే తారక్ మాత్రం ఇలాంటివి పట్టించుకోవద్దని అన్నారట. అనవసర విషయాల జోలికి వెళ్లొద్దని లైట్ తీస్కున్నారట. ఇదంతా సోషల్ మీడియా హంగామా మాత్రమే. ఎక్కువ స్పందించి ప్రాధాన్యతనివ్వడం సరికాదని భావించి తారక్ పట్టించుకోవద్దని అన్నారట. దీంతో ఈ వివాదం సమసిపోయినట్టేనని భావించిన తారక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాల్లో మాత్రం దీనిపై ఇంకా కామెంట్లు చేస్తూనే ఉన్నారు.