అన్న సినిమాతో పాటు అవీ ఆడాలి : ఎన్టీఆర్

0

టాలీవుడ్ స్టార్ హీరోలు ఒకప్పుడు ఒకరిపై ఒకరు పోటీతో ఒకరి సినిమాల గురించి మరొకరు స్పందించేందుకు ఆసక్తి చూపించే వారు కాదు. కాని ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ప్రస్తుతం యంగ్ స్టార్ హీరోల మద్య పోటీ తీవ్రంగా ఉన్నా కూడా స్టార్ హీరోలు అంతా కూడా చాలా స్నేహంగా ఒకరి తో ఒకరు కలిసి పోయి ఉంటున్నారు. ఒకరి సినిమాలకు మరొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఉన్నారు.

సంక్రాంతికి దర్బార్.. సరిలేరు నీకెవ్వరు.. అల వైకుంఠపురంలో ఇంకా ఎంత మంచివాడవురా చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అల వైకుంఠపురంలో సినిమా ప్రీ రిలీజ్ వేడుక సమయంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ నా సినిమాతో పాటు అన్ని సినిమాలు బాగా ఆడాలి అంటూ శుభాకాంక్షలు తెలియజేశాడు. ఇటీవలే ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న రామ్ చరణ్ సంక్రాంతికి విడుదల కాబోతున్న అన్ని సినిమాలు కూడా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను అంటూ శుభాకాంక్షలు తెలియజేశాడు.

ఇక నిన్న జరిగిన ఎంత మంచివాడవురా చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అథితిగా పాల్గొన్న ఎన్టీఆర్ కూడా సంక్రాంతి సినిమాల గురించి స్పందించాడు. మా సినిమాను ఆధరించడంతో పాటు సంక్రాంతికి విడుదల కాబోతున్న దర్బార్.. సరిలేరు నీకెవ్వరు మరియు అల వైకుంఠపురంలో సినిమాలను కూడా ఆధరించాలని.. అన్ని సినిమాలు సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అన్నాడు. ఇలా ఇతర హీరోల సినిమాలకు స్టార్ హీరోలు శుభాకాంక్షలు చెప్పడం అనేది శుభపరిణామం అంటూ సినీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Please Read Disclaimer