వీర రాఘవుడికి 30 రోజుల సెలవు!!

0

అక్టోబర్ 11న అభిమానులు వీర రాఘవ రెడ్డిగా యంగ్ టైగర్ విశ్వరూపాన్ని చూసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఆ మూడ్ లో లేడనే విషయం స్పష్టం. నాన్న హరికృష్ణ అకాల మరణం చెందటం తమను ఎంత బాధిస్తోందో వేదిక సాక్షిగా బయటపడిన అన్నదమ్ములు కళ్యాణ్ రామ్ తారక్ లను తలుచుకుని ఫ్యాన్స్ కూడా కంటతడి పెట్టుకుంటున్నారు. నిర్మాతకు ఇచ్చిన కమిట్మెంట్ రిలీజ్ డేట్ ఇంతకు ముందే ఫిక్స్ కావడం లాంటి కారణాల వల్ల నాన్న చనిపోయిన వారం లోపే షూటింగ్ లో పాల్గొన్న జూనియర్ ఆ శోకాన్ని దిగమింగుకుంటూనే బాలన్స్ పూర్తి చేసాడు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ ప్రమోషన్ లో అత్యంత కీలకం కాబట్టి దీనికి నో చెప్పడానికి ఉండదు. అది నిన్న విజయవంతంగా పూర్తయ్యింది. ట్రైలర్ కూడా మంచి స్పందన దక్కించుకుంటోంది. ఇప్పుడు తారక్ నెక్స్ట్ ఏం చేస్తాడు అనే ఆసక్తి ఉండటం సహజం.

విశ్వసనీయ సమాచారం ప్రకారం జూనియర్ నెల రోజుల పాటు పూర్తిగా రెస్ట్ మోడ్ లోకి వెళ్లనున్నాడు. నాన్న పోయిన జ్ఞాపకాల నుంచి బయటికి రావాలన్నా టైం కి షూటింగ్ ఫినిష్ చేయాలన్న ఒత్తిడితో భారాన్ని మోసినందుకు రిలీఫ్ దొరకాలన్నా ఇదొక్కటే మార్గంగా సన్నిహితులు సూచించారట. అందుకే పోస్ట్ రిలీజ్ తర్వాత జరిగే ప్రమోషన్స్ లో తారక్ ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఎలాగూ గట్టి నమ్మకం ఉంది కాబట్టి విజయం సాధించాక తాను వచ్చినా రాకపోయినా పెద్దగా ప్రభావం ఉండదని తారక్ భావిస్తున్నాడట.

దీని తర్వాత రాజమౌళి మల్టీ స్టారర్ కోసం తారక్ రెడీ కావాల్సి ఉంటుంది. మరోవైపు చరణ్ కూడా బోయపాటితో సినిమా ఫినిష్ చేసి డిసెంబర్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఇద్దరు ఒకేసారి సెట్స్ లో అడుగు పెడతారా లేక విడివిగా వస్తారా అనే క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.