ఏప్రిల్ 12 నుండి సెట్స్ పైకి ఎన్టీఆర్ మూవీ..

0కొన్ని రోజుల క్రితం ఎన్టీఆర్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే చిత్ర పూజా కార్య క్రమాలు పూర్తి చేసుకున్న సంగతి తెల్సిందే. కొన్ని రోజులుగా త్రివిక్రమ్ స్క్రిప్ట్ పనులతో బిజీ అవడం , ఎన్టీఆర్ సైతం తన బాడీని మార్చుకునే ప్రయత్నాలు చేయడం తో సెట్స్ పైకి వెళ్లేందుకు ఆలస్యం అయ్యింది. ఇక తాజాగా అన్ని పనులు పూర్తి కావడం తో ఏప్రిల్ 12 నుండి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లని నిర్ణయం తీసుకున్నారు.

ఈ ఏడాది మధ్యలోకి సినిమాను పూర్తిచేసి దసరాకి ప్రేక్షకులకి అందివ్వాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. ఎన్టీఆర్ కు జోడిగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా , రాధాకృష్ణ ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.