మీడియా రంగంలో అడుగు పెట్టబోతున్న ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి…?

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి మీడియా రంగంలోకి అడుగుపెట్టబోతోందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఎంబీఏ కంప్లీట్ చేసిన లక్ష్మీ ప్రణతి 2011లో తారక్ ని వివాహం చేసుకొని హౌజ్ వైఫ్ గా ఉండిపోయింది. ప్రస్తుతం ఇద్దరు పిల్లలు అభయ్ రామ్ భార్గవ్ రామ్ ఆలనాపాలనా చూసుకుంటోంది. అయితే లక్ష్మి ప్రణతి త్వరలోనే ఓ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ కి మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించబోతోందట. కాగా లక్ష్మీ ప్రణతి తండ్రి నార్నె శ్రీనివాస్ ‘స్టూడియో ఎన్’ అనే న్యూస్ ఛానల్ స్థాపించిన సంగతి తెలిసిందే. అదే కోవలో నార్నె శ్రీనివాస్ చెల్లెలు కూడా ఓ ఎంటర్టైన్మెంట్ ఛానల్ స్థాపించబోతోందట. ఈ ఛానల్ కి లక్ష్మీ ప్రణతి ఎండీగా ఉండే అవకాశాలున్నాయని న్యూస్ బయటకి వచ్చింది. ఇప్పటికే తన తండ్రి స్థాపించిన ఛానల్ వలన దాని మీద ఐడియా ఉండటంతో పాటు విద్యాపరంగా కూడా ఉన్నత చదువులు చదువుకున్న ప్రణతి ఇప్పుడు దీనిపై ఇంట్రెస్ట్ చూపిస్తోందట. ఈ ఛానల్ నేమ్ ‘యువ’ అని.. ఇది పూర్తిగా ఎంటర్టైన్మెంట్ కి సంబంధించింది అని మీడియా వర్గాల్లో అనుకుంటున్నారు. దీనికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయట. త్వరలోనే ఈ ఛానల్ కి సంబందించిన పూర్తి వివరాలు అధికారికంగా వెలువడే అవకాశం ఉందట.

ఇటీవల కాలంలో మహిళలు అన్ని రంగాల్లో పురుషులకు పోటీగా దూసుకుపోతున్నారు. ఇక స్టార్ సెలబ్రటీల సతీమణులు కూడా బిజినెస్ వైపు ఆలోచనలు చేస్తున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైనా భర్త బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ అతనికి సపోర్ట్ గా ఉంటూ వస్తోంది. మహేష్ ఏఎంబీ థియేటర్స్ మరియు హుంబుల్ టెక్స్ టైల్ బిజినెస్ లు స్టార్ట్ చేయడానికి నమ్రతే కారణమని ఇండస్ట్రీ వర్గాలు అంటుంటారు. ఇక జీఎంబీ ప్రొడక్షన్ హౌజ్ స్టార్ట్ చేసి సినిమా నిర్మాణాలలోను కీలకంగా వ్యవహరిస్తోంది. ఇక రామ్ చరణ్ సతీమణి ఉపాసన అపోలో హాస్పిటల్ యాజమాన్య బాధ్యతలు చూసుకుంటూ ఫ్యామిలీ లైఫ్ ని బ్యాలన్స్ చేస్తూ వస్తోంది. ఇటీవల అల్లు అర్జున్ వైఫ్ స్నేహారెడ్డి కూడా బన్నీకి బిజినెస్ వైపుగా అడుగులు వేసేలా ప్రోత్సహిస్తూ వస్తోందట. ఇప్పుడు లక్ష్మీ ప్రణతి కూడా అదే విధంగా బిజినెస్ రంగం వైపు అడుగులు వేస్తుందేమో చూడాలి.
Please Read Disclaimer