లేడీ హాట్ ఎంపీ ఫరెవ్వర్!!

0

నుస్రాత్ జహాన్ రుహీ జైన్ .. హాట్ లేడీ ఎంపీగా పాపులర్. బెంగాలీ నటి కం తృణమూల్ కాంగ్రెస్ ఎంపీగా ఇప్పటికే ప్రజల్లో నీరాజనాలు అందుకుంటున్నారు. అప్పట్లో నుస్రత్ జహాన్ రాజకీయారంగేట్రం సహా పెళ్లి వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది. కోల్కతాకు చెందిన బిజినెస్ మేన్ నిఖిల్ జైన్ ని నుస్రాత్ పెళ్లాడారు. టర్కీలోని బోడ్రమ్లో జరిగిన పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలను ఈ జంట సోషల్ మీడియాలో షేర్ చేశారు.

లేడీ ఎంపీ నుస్రత్ తొలుత అందాల పోటీల ద్వారా ఫేమస్ అయ్యారు. 2010 మిస్ కోల్ కథ గా నుస్రాత్ పేరు మార్మోగింది. అటుపై సినీ ఆరంగేట్రం చేశారు. రాజ్ చక్రబర్తి తెరకెక్కించిన షొత్రు అనే చిత్రంతో 2011లో కథానాయికగా తెరకు పరిచయం అయ్యారు. అటుపై బోయ్ ఫ్రెండ్ నిఖిల్ ని పెళ్లాడారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో అనూహ్యంగా రాజకీయారంగేట్రం చేస్తూ.. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా భాజపా అభ్యర్థి సయంతన్ బసుపై 350369 ఓట్లతో నెగ్గారు. 2019 ఎన్నికల వేళ నుస్రాత్ తన ఆస్తుల వివరాల్ని వెల్లడించారు. 2.90 కోట్ల ఆస్తులు తన సొంతం. అందులో 91లక్షలు చరాస్తులు.. 5 లక్షల క్యాష్.. 30 లక్షల బ్యాంక్ డిపాజిట్లు.. లక్ష బాండ్లు.. రెండున్నర లక్షల ఇన్సూరెన్స్ ఉన్నట్టు చూపించారు. వృత్తిగతంగా 5లక్షల ఆదాయం వస్తోందని లెక్క చెప్పారు. 26లక్షల మేర ఐటీ చెల్లిస్తున్నట్టు నుస్రత్ రివీల్ చేశారు.కోల్ కతలో 2కోట్ల విలువ చేసే ఇల్లు ఉంది… అయితే ఇల్లు .. ఇంట్లో వస్తువులు.. కార్లు కలిపి 1.68 కోట్ల మేర అప్పులు ఉన్నట్టు చూపించారు.

ఇక నుస్రాత్ తన భర్త నిఖిల్ తో కలిసి ఎంతో ట్రెడిషనల్ గా కనిపించే ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. సభ్యసాచి బ్రాండ్ లెహెంగా డ్రెస్ లో నుస్రాత్ భర్తతో కలిసి దిగిన ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. ఇక యూత్ ట్రెండీగా ఫీలయ్యే అల్ట్రా మోడ్రన్ లుక్ లో నుస్రాత్ ఫోజులు వెబ్ లో అంతే పాపులరవుతున్నాయి. లేడీ హాట్ ఎంపీ ఫరెవర్!! అంటూ యూత్ ఫిదా అయిపోవడం హాట్ టాపిక్.