సాహో లో ప్రభాస్ వాడిన బ్లూటూత్ గురించి మీకు తెలియని సీక్రెట్స్!!

ఓ పిట్టకథ :టీజర్ టాక్

0

కంటెంట్ ఉంటే కటౌట్ తో పనిలేదని చాలా చిన్న సినిమాలు నిరూపించాయి. స్టార్ ఇమేజ్ లేకుండా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధించాయి. పెళ్లి చూపులు- క్షణం- ఎవరు- ఆర్.ఎక్స్-100- ఆత్రేయ లాంటి చిత్రాలు ఆ కోవలో సక్సెస్ అయినవే. దీంతో ఆ చిత్రాల దర్శక హీరోలు టాలీవుడ్ లో ప్రస్తుతం బిజీ. తాజాగా నటుడు బ్రహ్మాజీ తనయుడు `ఓ పిట్టకథ` అనే చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ లో ఉంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన దక్కింది.

తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది. “అనగనగా ఒక ఊరిలో వెంకటలక్ష్మి అనే అందమైన అమ్మాయి ఉండేదంట. అదే ఊరిలో ఉంటున్న ప్రభుకి వెంకటలక్ష్మి అంటే చిన్నప్పటి నుంచి ఇష్టమంట. అప్పుడే వెంకలక్ష్మి ఇంటికి క్రిష్ వచ్చాడంట. క్రిష్ కి వెంకటలక్ష్మి అంటే ఇష్టమంట. మరి వెంకటలక్ష్మి కి ఇద్దరిలో ఎవరంటే ఇష్టం అంటే? అది తెలిసేలోపే వెంకటలక్ష్మి మిస్ అయిపోయిందిగా..మరి తర్వాత ఏమైందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే“ అంటూ ఓ సస్పెన్స్ తో టీజర్ కట్ చేసారు. ఓ బాలిక వాయిస్ ఓవర్ తో టీజర్ ను మొదలు పెట్టిన తీరు ఆకట్టుకుంది. ఈ వాయిస్ లోనే సినిమా కథేంటో దాగి ఉంది.

గోదారి అందాల నడుమ తెరకెక్కిస్తున్న ఓ అందమైన పల్లెటూరి ప్రేమకథా చిత్రమిదని అర్థమవుతోంది. పల్లెల్లో సెలయేరు…పచ్చదనం..స్వచ్ఛమైన వాతావరణాన్ని విజువల్ గా ఎంతో అందంగా చిత్రీకరించారు. హీరోయిన్ ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్ లో మురిపిస్తుంది. ప్రభు పాత్ర పల్లెటూరి కుర్రాడిగా.. క్రిష్ విదేశాల నుంచి వచ్చిన యువకుడిగా కనిపించి మెప్పించారు. సినిమాలో హీరోయిన్ పాత్ర కీలకంగా కనిపిస్తోంది. మరి వెంకటలక్ష్మి ప్రేమను ఇద్దరిలో ఎవరు దక్కించుకున్నారు? సినిమాలో అసలు మ్యాటర్ ఎంత? అన్నది తెలియాలంటే రిలీజ్ వరకూ వెయిట్ చేయాల్సిందే. ఆద్యంతం గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో టీజర్ లో చెప్పినంత సరళంగా ఆహ్లాదంగా సినిమాని చూపించగలిగితే హిట్ కొట్టే ఛాన్సుంటుంది. బ్రహ్మాజీ వారసుడు లుక్ పరంగా ఓకే. నటన పరంగా తొలి ప్రయత్నం ఎలా ఉంటుందో చూడాలి. ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ పతాకంపై ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. చెందు ముద్దు దర్శకత్వం వహిస్తున్నాడు. మార్చిలో సినిమా రిలీజ్ కానుంది.
Please Read Disclaimer