బాహుబలి మనోహరి కిరాక్ ఐటెమ్

0

బాహుబలి మనోహరిగా విదేశీ ఐటెమ్ గాళ్ నోరా ఫతేహికి వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. అంతకుముందు ఎన్నో బాలీవుడ్ సినిమాల్లో ఐటెమ్ నంబర్లలో నటించినా రాని గుర్తింపు ఆ ఒక్క ప్రత్యేక గీతంతో వచ్చింది. ఈ భామ ప్రస్తుతం బాలీవుడ్ లో పలు ఐటెమ్ నంబర్లలో నర్తిస్తూ ఇండస్ట్రీని వేడెక్కిస్తోంది.

లేలో లేలో .. పాంచ్ సౌ.. కా మాల్.. సౌ కో లేలో!! ఒక్క షార్ట్ 500 మాత్రమే! అంటూ ఇటీవల బ్యాంకాక్ వీధుల్లో బట్టలమ్ముతూ ఈ బ్యూటీ బోలెడంత ఫన్ క్రియేట్ చేసింది. నోరా ఏం చేసినా సంథింగ్ స్పెషల్ గానే ఉంటుంది. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ లో కెరియర్ పరంగా ఫుల్ బిజీ. ఎప్పుడూ ఏదో ఒక హీటెక్కించే ఎపిసోడ్ తో సామాజిక మాధ్యమాల్లోనూ టచ్ లో ఉంటోంది.

తాజాగా నోరా ఫతేహి అప్ కం ఐటెమ్ నంబర్ కి సంబంధించిన టీజర్ ఒకటి అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆగస్టు 15న రిలీజవుతున్న `బాట్లా హౌస్` (జాన్ అబ్రహాం) చిత్రంలో నోరా అదిరిపోయే ఐటెమ్ నంబర్ తో ట్రీటివ్వబోతోంది. తాజా సాంగ్ టీజర్ `ఓ సఖి సాఖిరే..`లో నోరా బెల్లీ డ్యాన్స్ మెరుపులు కుర్రకారును కవ్విస్తున్నాయి. టెర్రరిజం నేపథ్యంలో తెరకెక్కుతున్న బాట్లా హౌస్ టీజర్ ఇదివరకూ రిలీజై ఆకట్టుకుంది. ఓవైపు సీరియస్ గా సాగే యాక్షన్ డ్రామాలో నోరా ఫతేహీ ఐటెమ్ నంబర్ పెద్ద రిలీఫ్ నిస్తుందనడంలో సందేహమే లేదు. కేవలం కొన్ని సెకన్ల వీడియోలో నోరా డ్యాన్సింగ్ ట్యాలెంట్ ని ఓ రేంజులో ఎలివేట్ చేశారు. దిల్ బర్ మేకర్స్ నుంచి వస్తున్న విజువల్ గ్లింప్స్ ఇది. జూలై 15న పూర్తి పాటను విడుదల చేయనున్నారు.
Please Read Disclaimer