పాకిస్తానీ టెర్రరిస్ట్ గా ఓబేబీ

0

గత ఏడాది ఓబేబీ మరియు మజిలీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత ఇప్పటి వరకు అధికారికంగా కొత్త సినిమాలకు కమిట్ కాలేదు. కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నట్లుగా తెలుస్తోంది. కరోనా ఇతర్రత కారణాల వల్ల ఈ ఏడాది ఆమె కొత్త సినిమాలత వచ్చే అవకాశం లేదు. అయితే సమంత ది ఫ్యామిలీమెన్ 2 వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అమెజాన్ లో గత ఏడాది వచ్చిన ది ఫ్యామిలీ మెన్ సూపర్ సక్సెస్ అయ్యింది. అందుకే సీక్వెల్ చేశారు. ఈ సీక్వెల్ లో ప్రముఖ నటీనటులు నటించారు.

మనోజ్ బాజ్పాయి.. ప్రియమణిలతో పాటు సమంత కూడా ఈ వెబ్ సిరీస్ సీక్వెల్ లో కనిపించబోతుంది. మొదటి నుండి కూడా ఈ వెబ్ సిరీస్ లో సమంత నెగటివ్ రోల్ లో కనిపించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పాకిస్తానీ ఉగ్రవాది పాత్రలో సమంత కనిపించబోతుందట. విభిన్నమైన పాత్రతో పాటు గెటప్ విషయంలో కూడా సమంత కొత్తగా కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. భారీ అంచనాలున్న ఈ వెబ్ సిరీస్ ఈ ఏడాది చివరి నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవ్వబోతుంది.