`ఓ బేబి` క్లోజింగ్ షేర్.. ఇదీ సంగతి

0

సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం `ఓ బేబి`. సీనియర్ నటి లక్ష్మి.. యువకథానాయకుడు నాగశౌర్య.. నటకిరీటి రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలు పోషించారు. నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ- సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఫ్రెంచి సినిమా `మిస్ గ్రానీ`కి రీమేక్ చిత్రమిది. తెలుగులోనూ ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో హిందీలోనూ రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇరుగు పొరుగు భాషల రీమేక్ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది.

ఓ బేబి సమంత కెరీర్ బెస్ట్ సినిమాగా రికార్డులకెక్కింది. మజిలీ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సామ్ కి మరపురాని జ్ఞాపకంగా మిగిలింది. ఈ చిత్రంతో నందిని రెడ్డి కెరీర్ పరంగా బౌన్స్ బ్యాక్ అవ్వడం విశేషం. ఈ సినిమా హక్కులు కొనుక్కున్న పంపిణీదారులు హ్యాపీ అన్న టాక్ వినిపించింది. తాజాగా ఓ బేబి ఫుల్ రన్ షేర్ వసూళ్ల రిపోర్ట్ అందింది.

నైజాం – 4.97 కోట్లు.. సీడెడ్ – 1.60 కోట్లు.. వైజాగ్ – 1.90 కోట్లు.. గుంటూరు – 0.84 కోట్లు .. ఈస్ట్ – 0.80 కోట్లు.. వెస్ట్ – 0.70 కోట్లు .. కృష్ణా – 1.05 కోట్లు .. నెల్లూరు – 0.40 కోట్లు వసూలైంది. ఏపీ తెలంగాణ కలుపుకుని 12.26 కోట్లు (షేర్) వసూలైంది. గ్రాస్ ఆల్మోస్ట్ 25కోట్లు పైగా ఉంటుందని చెబుతున్నారు. ఒక నాయికా ప్రధాన చిత్రానికి ఈ స్థాయి విజయం ప్రశంసించదగినదని విశ్లేషిస్తున్నారు.
Please Read Disclaimer