బేబీ అక్కినేని.. హబ్బీ రికార్డుకు ఎసరు!

0

నందిని రెడ్డి దర్శకత్వంలో సమంతా అక్కినేని ప్రధాన పాత్రలో నటించిన ‘ఓ బేబీ’ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సమంతా నటనకు సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. ఇదిలా ఉంటే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పరంగా కూడా ‘ఓ బేబీ’ తన సత్తా చాటుతోంది. అమెరికాలో ఓ బేబీ ఇప్పటివరకూ $809k కలెక్షన్స్ సాధించింది.

స్టార్ హీరోల సినిమాలకు ఈ కలెక్షన్ సాధారణమేమో కానీ ఒక లేడీ ఓరియెంటెడ్ ఫిలింకు చాలా పెద్ద ఘనతే. అంతే కాదు ఈ కలెక్షన్స్ తో సమంతా మరో అరుదైన ఫీట్ సాధించింది. సమంతా స్వీట్ హబ్బీ నాగచైతన్య కెరీర్ లో సోలో గా అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రం ‘మజిలీ'($799 K). ఇప్పుడు ‘ఓ బేబీ’ ఆ కలెక్షన్స్ ను క్రాస్ చేయడం విశేషమే కదా. మరో విషయం ఏంటంటే ‘మజిలీ’ లో కూడా సమంతానే మెయిన్ హీరోయిన్ కావడం. దీన్ని బట్టి చూస్తే ఓవర్సీస్ లో సమంతా నటించిన సినిమాలకు మంచి ఆదరణ దక్కుతోందని చెప్పవచ్చు. సమంతా హయ్యెస్ట్ కలెక్షన్స్ ను చైతూ దాటాలంటే మరో మంచి సినిమాతో ముందుకు రావాల్సిందే.

నాగ చైతన్య ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో ‘వెంకీమామ’ సినిమా .. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నాడు. మరోవైపు సమంతా తమిళ సూపర్ హిట్ ’96’ తెలుగు రిమేక్ లో నటిస్తోంది. ఈ సినిమా కాకుండా మామగారు అక్కినేని నాగార్జున నటిస్తున్న ‘మన్మథుడు 2’ కూడా ఒక అతిథి పాత్రలో నటిస్తోంది.
Please Read Disclaimer