ఆ రెండింటి సరసన ‘ఓబేబీ’

0

‘మజిలీ’ చిత్రంతో సక్సెస్ దక్కించుకున్న సమంత ఆ వెంటనే ‘ఓబేబీ’ చిత్రంతో మరో సక్సెస్ ను దక్కించుకుంది. కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’కి అఫిషియల్ రీమేక్ అయిన ఓ బేబీ చిత్రంతో సమంత నటిగా రెచ్చి పోయింది. కామెడీతో పాటు ఎంటర్ టైన్ మెంట్ పరంగా కూడా సమంత ఆకట్టుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం భారీ వసూళ్లను నమోదు చేసింది. ఈ రీమేక్ చిత్రం ఓవర్సీస్ లో మంచి వసూళ్లను నమోదు చేసింది. తాజాగా మిలియన్ మార్క్ ను చేరి రికార్డును సొంతం చేసుకుంది.

ఇప్పటి వరకు తెలుగు సినిమాలు ఓవర్సీస్ లో మిలియన్ డాలర్లను వసూళ్లు చేయడం ఎన్నో సార్లు చూశాం. కాని హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలు కేవలం రెండు మాత్రమే మిలియన్ డాలర్లను క్రాస్ చేశాయి. అనుష్క నటించిన ‘భాగమతి’ మరియు కీర్తి సురేష్ ‘మహానటి’ చిత్రాలు మాత్రమే యూఎస్ లో ప్రేక్షకులను అలరించి డాలర్ల వర్షం కురిపించాయి. మళ్లీ ఇప్పుడు ఓ బేబీ చిత్రం యూఎస్ లో మిలియన్ డాలర్లను రాబట్టింది.

నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సమంత వృద్దురాలి పాత్రలో కనిపించింది. యుక్త వయసులోకి వచ్చిన వృద్దురాలు ఎలా ప్రవర్తిస్తుందో అచ్చు అలాగే చాలా సహజంగా సమంత నటించి మెప్పించింది. సమంత ఈ చిత్రంతో నటిగా మంచి మార్కులు పొందింది. సమంత చేసిన ‘యూటర్న్’ చిత్రం నటిగా మంచి మార్కులు తెచ్చి పెట్టినా కూడా కమర్షియల్ గా మాత్రం మెప్పించలేదు. ఈసారి ఓబేబీ మాత్రం రెండు విధాలుగా సమంత సక్సెస్ అయ్యింది. సమంత కెరీర్ లో ‘ఓబేబీ’ చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది.
Please Read Disclaimer