ఓ బేబీ ట్రైలర్ టాక్

0

విభిన్న పాత్రలతో గ్లామర్ కు స్కోప్ లేకపోయినా నటనతో ఆకట్టుకుంటున్న సమంతా కొత్త సినిమా ఓ బేబీ ట్రైలర్ విడుదలైంది. నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ మీద ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ట్రైలర్ సంగతి చూస్తే సావిత్రి(లక్ష్మి)అనే బామ్మ తన జ్ఞాపకాలను పంచుకోవడంతో స్టార్ట్ అవుతుంది. అది ఓ అమ్మాయి(సమంతా)రూపంలో ఇంకో అబ్బాయి(నాగ శౌర్య)కు చెబుతుండగా కళ్ళ ముందు కనిపిస్తుంది.

వయసులో ఉండగానే భర్త చనిపోయిన సావిత్రి నాని(రావు రమేష్)ని పెంచి పెద్ద చేసి అతని ఇద్దరు పిల్లలకు నాన్నమ్మ అవుతుంది. ఆ తర్వాత అనూహ్యంగా వయసు తగ్గించుకుని సమంతాలా కనిపించే తన వయసులో ఉన్నప్పటి రూపంలో వస్తుంది. ఇక అక్కడి నుంచి సరదాసరదాగా గడిచే జీవితం చివరికి ఏ మలుపు తీసుకుందో అదే ఓ బేబీ. ట్రైలర్ చివర్లో సమంతా నాతో ఎంజాయ్ మెంట్ మాములుగా ఉండదు ఒక్కొక్కడికి అని చెప్పడం బాగా పేలింది

మొత్తానికి టీజర్ చాలా ఫ్రెష్ గా ఉంది. గతంలో రాని ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే తీసుకున్నారు. వయసు మళ్ళిన లక్ష్మి పాత్ర అనుకోకుండా పాతికేళ్ళు వెనక్కు వెళ్తే ఇప్పుడు వర్తమాన సమాజంలో తాను ఎదురుకునే సంఘటనలు ఆధారంగా చేసుకుని అల్లిన కథలో బోలెడు ఫన్ తో పాటు ఎంటర్ టైన్మెంట్ కూడా బాగా దట్టించినట్టు కనిపిస్తోంది.

రిచర్డ్ ప్రసాద్ ఛాయాగ్రహణం మంచి ఫీల్ తీసుకురాగా మిక్కి జే మేయర్ మ్యూజిక్ కూడా మ్యాచ్ అయ్యేలా సాగింది. లక్ష్మి భూపాల సంభాషణలు అందించిన ఓ బేబీని సురేష్ సంస్థతో పాటు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ-గురు ఫిలిమ్స్-క్రాస్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మొత్తానికి అంచనాలు పెంచడంలో ఓ బేబీ ట్రైలర్ తోనే మొదటి అడుగు పర్ఫెక్ట్ గా వేసేసింది