ఓంకార్ కు కరోనా టెస్ట్.. క్లారిటీ

0

కరోనా కల్లోలం సినీ టీవీ పరిశ్రమను తాకుతోంది. ఇప్పటికే ఒక ప్రముఖ సినీ నటుడికి కరోనా పాజిటివ్ రావడంతో టీవీ పరిశ్రమ షేక్ అయ్యింది. దెబ్బకు షూటింగ్ లన్నీ నిలిచిపోయాయి. అందరూ క్వారంటైన్ కు.. టెస్టులు చేసుకున్నారు.

లాక్ డౌన్ సడలింపులతో టీవీ షూటింగ్ లు మొదలు పెట్టిన వారికి ఇప్పుడు కరోనా శాపంగా మారింది. హైదరాబాద్ లో కరోనా విపరీతంగా పెరగడంతో దాన్ని కంట్రోల్ చేయడం సాధ్యపడడం లేదు. ఈ నేపథ్యంలో సినిమాటీవీ షూటింగ్ లకు కూడా కరోనా పాకుతోంది. దీంతో సినీ పరిశ్రమలో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది.

ప్రస్తుతం లాక్ డౌన్ సడలింపులతో మొదలైన షూటింగ్ లు కొనసాగించాలా లేదా అనే డైలామాలో దర్శకులు నిర్మాతలున్నారు. ప్రస్తుతం పరిశ్రమలో రెండు పాజిటివ్ కేసులు రావడంతో పుకార్లు మొదలయ్యాయి. దీంతో కరోనా లేనివారికి కూడా కరోనా అంటగడుతున్నారు.

తాజాగా ప్రముఖ యాంకర్ ప్రొడ్యూసర్ ఓంకార్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్టు వార్తలు వచ్చాయి. ఆ వార్తలపై ఆయన కుటుంబ సభ్యులు క్లారిటీ ఇచ్చారు. ఓంకార్ కు కరోనా రాలేదని.. కేవలం టెస్ట్ మాత్రమే చేయించుకున్నాడని తెలిపారు. రిపోర్టుల్లో నెగిటివ్ వచ్చినట్టు తెలిపారు. సోమవారం ఆయన షూటింగ్ లో సైతం పాల్గొంటారని తెలిపారు.
Please Read Disclaimer