హీరోయిన్ కు కరోనా వైరస్

0

రాజు.. పేద.. సెలబ్రిటీ.. సామాన్యుడు.. వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా ఎడాపెడా ఎవరు దొరికితే వారిలోకి వెళ్లిపోయి వారి ఆరోగ్య వ్యవస్థల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోందిన కరోనా వైరస్. దీని కారణంగా యావత్ ప్రపంచం ఇప్పుడు గడగడలాడిపోతోంది. ఇటీవల కాలంలో ప్రపంచంలో చోటు చేసుకోని సీన్లు ఒక్కొక్కటిగా తెర మీదకు వస్తున్నాయి.

కరోనా బారిన ఇప్పటికే పలువురు ప్రముఖులు పడగా.. తాజాగా ఆ జాబితాలో బాండ్ భామ ఓల్గా కురిలెంకో చేరారు. బాండ్ సిరీస్ లో భాగంగా ఆ మధ్యన వచ్చిన క్వాంటం ఆఫ్ సొలేస్ లో తన నటనతో.. అందంతో మనసుల్ని దోచేసిన ఈ ముద్దుగుమ్మకు కరోనా సోకినట్లుగా పోస్టు పెట్టింది. గడిచిన వారంగా తనకు బాగోలేదన్న ఆమె.. తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు కన్ఫర్మ్ చేసింది.

తమ అభిమాన నటి కరోనా బారిన పడటం ఆమె అభిమానుల్ని నిరుత్సాహానికి గురి చేస్తోంది. తన సోషల్ ఖాతాలో తాజాగా పోస్టు పెట్టిన ఆమె.. కరోనా వైరస్ ను తేలిగ్గా తీసుకోవద్దని.. సీరియస్ గా తీసుకోవాలని చెప్పింది. తానీ వైరస్ ను పెద్దగా పట్టించుకోలేదని.. తనకు వస్తుందని తాను అనుకోలేదని ఈ ఉక్రెయిన్ నటి పేర్కొంది.

కరోనా కారణంగా తాను ఇంట్లోనే బందీని అయ్యానని పేర్కొన్నారు. ప్రస్తుతం తనను జ్వరం వేధిస్తుందని.. తీవ్రమైన అలసటతో ఉన్నట్లు పేర్కొంది. ఈమె వెంటనే కోలుకోవాలంటూ ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-