‘ఆర్ఆర్ఆర్’ కోసం ఎదురు చూస్తుందట

0

మొన్నటి వరకు ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం వచ్చే ఏడాది జులై 30న అంటూ మాట్లాడుకునేవాళ్లం. కాని కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాం. ఈ ఏడాది జులైలోనే ఆర్ఆర్ఆర్ రాబోతుంది అనే మాట అందరికి ఆనందాన్ని కలిగిస్తుంది. 2018 నుండి ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకుల జాబిత రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఇక ఈ చిత్రంలో హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ ఎన్టీఆర్ కు జోడీగా నటిస్తున్న విషయం తెల్సిందే. ఒలీవియా మోరిస్ తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్రం గా గురించి స్పందించింది.

తన ఫాలోవర్స్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం చాలా ఆసక్తి గా ఎదురు చూస్తున్నట్లు గా చెప్పుకొచ్చింది. హాలీవుడ్ నటి అయినా కూడా జక్కన్న మూవీలో నటించేందుకు ఎంత ఆసక్తిగా ఉంటారో.. ఎంత ఉత్సాహాన్ని కనబర్చుతారో ఆమె సోషల్ మీడియా పోస్ట్ ను చూస్తే అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో ఈమెను ఫాలో అయ్యే వారిలో 90 శాతం మంది కూడా ఇండియన్స్ అది కూడా ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం ఎదురు చూసేవారే. అందుకే ఆమె సినిమా కోసం ఎదురు చూస్తున్నాను అంటూ పోస్ట్ చేసిన వెంటనే వేలాది మంది మేము కూడా వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేశారు.

రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు అల్లూరి సీతారామరాజు మరియు కొమురం భీం పాత్రల్లో కనిపించబోతున్న ఆర్ఆర్ఆర్ మూవీ ఫస్ట్ లుక్ ను కొత్త సంవత్సరంకు విడుదల చేస్తారని అనుకుంటే నిరాశే మిగిలింది. సంక్రాంతికి అయినా జక్కన్న సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా ఇస్తాడేమో చూడాలి. భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రంను దాదాపుగా 10 భాషల్లో విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో జక్కన్న ఉన్నాడు.
Please Read Disclaimer