OMG డాడీ డిలే.. ముందు చూసుకోరా భయ్యా?

0

ఈరోజు తెలుగు ప్రేక్షకులకు స్టార్ హీరోల నుండి రెండు స్పెషల్ ట్రీట్స్ అందుతున్న సంగతి తెలిసిందే. వాటిలో ఒకటి అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ సినిమా నుండి మూడో సాంగ్ ‘OMG డాడీ’ విడుదల. రెండో ట్రీట్ ఏంటంటే మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ విడుదల. అల్లు అర్జున్ పాటను నాలుగు గంటలకు విడుదల చేస్తామని ప్రకటించగా.. మహేష్ సినిమా టీజర్ ను గంట గ్యాప్ లో ఐదు గంటలకు విడుదల చేస్తామని ప్రకటించారు.

అయితే కాసేపటి క్రితం తన ట్విట్టర్ ఖాతా ద్వారా OMG డాడీ పాట విడుదల ఆలస్యం అవుతుందని వెల్లడించాడు. “మాకు కొంచెం ఆలస్యం అయింది.. అయితే నిరీక్షణకు తగ్గ ఫలితం మాత్రం ఉంటుంది.. లవ్ యూ ఆల్” అంటూ ట్వీట్ చేశాడు. అయితే దీనిపై నెటిజన్లు కొందరు మండిపడుతున్నారు. “OMG డాడీ పాట కు కౌంట్ డౌన్ గా ’24 అవర్స్ టు గో’ అంటూ ఒక పోస్టర్.. ‘3 గంటల్లో’ అంటూ మరో పోస్టర్.. ‘1 గంటలో’ అంటూ ఇంకో పోస్టర్ రిలీజ్ చేసి జనాలలో ఆసక్తిని పెంచి ఇప్పుడు మైనర్ డిలే అంటావా” అంటూ థమన్ ను తిట్టడం మొదలు పెట్టారు.

మొదటి నుంచి ‘అల వైకుంఠపురములో’.. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలకు మధ్య ప్రమోషన్ వార్ నడుస్తోంది. సంక్రాంతికి ఈ రెండు సినిమాలు రిలీజ్ అవుతాయి అని తెలిసినప్పటి నుంచి పోటీ తీవ్రంగా ఉంది. ఈరోజు కూడా బన్నీ టీమ్ పాట విడుదల చేస్తుంటే మహేష్ టీమ్ టీజర్ తో ముందుకు వస్తున్నారు. ఇద్దరు హీరోల అభిమానుల మధ్య తమ హీరో ట్రీట్ అదిరిపోతుంది అంటే.. తమ హీరో ట్రీట్ అదిరిపోతుందని సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చలు కూడా సాగుతున్నాయి.

ఇలాంటి హై కాంపిటీషన్ లో ఈ డిలే సంగతి తెలిసిన బన్నీ ఫ్యాన్స్ “ముందు చూసుకోరా.. అటు సరిలేరు నీకెవ్వరు టీజర్ రిలీజ్ అవుతుంటే మీరు టైమ్ ఫిక్స్ చేసి ఇప్పుడు హ్యాండ్ ఇస్తారా?” అంటూ థమన్ పై ఫైర్ అవుతున్నారు. థమన్ మైనర్ డిలే అన్నాడు కానీ OMG డాడీ పాట ఎన్ని గంటలకు రిలీజ్ అవుతుందని చెప్పకపోవడం అభిమానులను అసహనానికి గురిచేస్తోంది. మరి ఈ కోపాన్ని థమన్ ఎలా చల్లారుస్తాడో వేచి చూడాలి.




Please Read Disclaimer