తమన్నా ఔట్…స్టోరీ చేంజ్

0

సాధారణంగా ఎవరైనా స్టార్ హీరోయిన్ ఒక చిన్న సినిమా చేస్తే ఆమె క్యారెక్టర్ కి కథలో స్కోప్ ఎక్కువ అనే విషయం ఇట్టే తెలిసిపోతుంది. అయితే ఆ హీరోయిన్ సినిమా నుండి తప్పుకుంటే ఆ క్యారెక్టర్ తాలూకు సన్నివేశాలు మారడం కూడా సహజమే. ఇప్పుడు ‘రాజు గారి గది3’ విషయంలో కూడా అదే జరిగింది. కాకపోతే సన్నివేశాలు కాకుండా కథ మొత్తం మారింది.

ముందుగా సినిమాకు తమన్నా ను తీసుకున్నారు. సినిమా ఆమె క్యారెక్టర్ చుట్టూ తిరిగేలా కథ రాసుకున్నారు. తమన్నా ఓపెనింగ్ కి కూడా వచ్చింది. ఒక్కసారిగా సినిమాపై బజ్ వచ్చింది. కట్ చేస్తే ఓ వారానికే సినిమా నుండి తమన్నా బయటికొచ్చేసింది. వెంటనే కాజల్ ని సంప్రదించాడు ఓంకార్. ఆమె డేట్స్ లేవని చెప్పేయడంతో ఇంకా ఛాయిస్ లేక తెలుగులో ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్న అవికాను తీసుకున్నారు.

ఇక్కడి దాకా అంతా బాగానే ఉంది. తమన్నా సినిమా నుండి బయటికి వచ్చి అవికా లోపలికి వెళ్లే లోపు అసలు కథ మారిపోయింది. అవికా క్యారెక్టర్ ని తగ్గించేశారు. ఈ సినిమాతో పూర్తి స్థాయి హీరోగా మారిన అశ్విన్ క్యారెక్టర్ ని పెంచేసి సినిమా షూట్ చేశారు. తమన్నా వెళ్ళాక తమ్ముడికి కలిసొచ్చింది కథ అశ్విన్ మీదకి టర్న్ అయిందంటూ ఈ విషయాన్ని ఓంకార్ స్వయంగా చెప్పాడు. మరి తమ్ముడి కోసం కథ మార్చేసిన ఓంకార్ ‘రాజు గారి గది 3’ హిట్ కొడతాడా చూడాలి.
Please Read Disclaimer