‘జబర్దస్త్’ నుండి మరో హీరో !

0

జబర్దస్త్ లో అందరికీ కొంత క్రేజ్ ఉన్నప్పటికీ సుడిగాలి సుధీర్ కి మాత్రం దానికిమించి ఉంది. జబర్దస్త్ లో తనో మన్మథుడు అన్నట్టుగా ప్రొజెక్ట్ చేసుకకుంటాడు సుధీర్. అలా రొమాంటిక్ ఇమేజ్ తో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడీ క్రేజ్ తోనే ఈ కమెడియన్ హీరోగా మారుతున్నాడు.
ప్రస్తుతం సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ జబర్దస్త్ ఇమేజ్ తో దూసుకెళ్తున్న సుధీర్ హీరోగా ఓ సినిమా చేసేసాడు. ఇటీవలే సినిమాకు సంబంధించి షూటింగ్ కూడా పూర్తయింది.

రాజశేఖర్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్న ఈ సినిమా కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉంటుందని తెలుస్తుంది. ఇందులో రష్మీ ఓ ఇంపార్టెంట్ రోల్ పోషించనుందని సమాచారం. గెటప్ శ్రీను రాం ప్రసాద్ కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. కొత్త అమ్మాయి సుధీర్ సరసన హీరోయిన్ గా నటిస్తోందట. ఈ సినిమాతో వరుసగా సినిమాలు కొట్టేయలనే ఆలోచనలో ఉన్నాడు సుధీర్.

అయితే జబర్దస్త్ ఇమేజ్ తో ఇప్పటికే కొందరు కమెడియన్స్ హీరోలుగా మారి సినిమాలు చేస్తున్నారు. మొదటి సినిమాతో ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేసి థియేటర్స్ కి రప్పించి ఆ తర్వాత మాత్రం అనుకున్నంత సక్సెస్ సాధించలేకపోయారు. మరి సుధీర్ అయిన నిలబడతాడేమో చూడాలి.
Please Read Disclaimer