బిగిల్ లో ఆ సన్నివేశాన్ని తీసేశారట

0

దీపావళి వేళ తన చిత్రాన్ని తప్పనిసరిగా రిలీజ్ చేసే అలవాటు ఇళైదళపతి విజయ్ కు అలవాటు. ఈసారి దీపావళికి బిగిల్ (తెలుగులో విజిల్) పేరుతో విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే భారీ కలెక్షన్లతో దూసుకెళుతోంది. రూ.200 కోట్ల కలెక్షన్ మార్క్ దాటిన చిత్రంగా మరో రికార్డును చేరుకుంది. కలెక్షన్ల పరంగా ఎలాంటి ఢోకా లేనప్పటికీ.. ఈ చిత్రంలో ఒక సన్నివేశంపై మాత్రం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

క్లైమాక్స్ లో తన జట్టులోని ఒక సభ్యురాలి ఆకారాన్ని ఉద్దేశించి హేళన చేస్తారు విజయ్. అయితే.. అది ఆమెలో చైతన్యాన్ని నింపి..కసితో జట్టు గెలుపుకు తోడ్పడాలన్న ఉద్దేశంతో ఉన్న ఈ సీన్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థూలకాయంగా ఉండే సదరు పాత్రధారిని ఉద్దేశించి.. ఆమె ఆకారాన్ని ఎటకారం చేయటం ఉంటుంది.

ఈ సీన్ పై వెల్లువెత్తుతున్న విమర్శల నేపథ్యంలో ఆ సీన్ ను తొలగించారు. అంతేకాదు.. ఈ సినిమా నిడివి ఒకట్రెండు నిమిషాలకు తక్కువగా మూడుగంటలు. దీంతో.. ఈ సినిమా కోసం తక్కువలో తక్కువ నాలుగు గంటలు (ట్రైలర్స్.. ఇంటర్వెల్ బ్రేక్.. సినిమాకు కాస్త ముందుగా రావటం లాంటివి) వరకూ పడుతున్న పరిస్థితి. దీంతో.. కాస్త ట్రిమ్ చేయాలన్న మాట పలువురు నోట వినిపిస్తున్న వేళ.. చిత్రాన్ని ట్రిమ్ చేసినట్లు తెలుస్తోంది. తమిళంలో చేసిన ఈ మార్పులు తెలుగులో కూడా చేశారా? అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
Please Read Disclaimer