మాస్ రాజాకి ఓన్లీ సీనియర్ భామలేనా?

0

వరుస సినిమాల తో మాస్ మహారాజా దూకుడు పెంచేసిన సంగతి తెలిసిందే. జయాపజయాల తో సంబంధం లేకుండా కెరీర్ పరంగా స్వింగు లో ఉన్నాడు. ప్రస్తుతం గోపిచంద్ మలినేని తో క్రాక్ చిత్రం చేస్తున్నాడు. ఇందులో శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత రమేష్ వర్మ దర్శకత్వం లో నటించనున్నాడు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి.

క్రాక్ చిత్రీకరణ పూర్తవ్వగానే ఈ కొత్త సినిమా మొదలవుతుంది. ఈలోగానే మరో దర్శకుడు త్రినాథరావు నక్కినతోనూ సినిమాకి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే త్రినాథరావు స్క్రిప్టును ఫైనల్ చేసేయడం.. దాంతో పాటే కాస్టింగ్ సెలక్షన్ కి సన్నాహాలు చేస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అప్పుడే ఈ సినిమా కోసం కథానాయికను లాక్ చేసే ప్రయత్నంలో ఉన్నారని తెలిసింది.

మాస్ మహారాజా సరసన మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా కథానాయిక అయితే బావుంటుందని దర్శకుడు త్రినాథరావు భావిస్తున్నారట. రాజాతో ఇంతకుముందు `బెంగాళ్ టైగర్` చిత్రంలో తమన్నా నటించిన సంగతి తెలిసిందే. ఈ జంట ఆన్ స్క్రీన్ రొమాన్స్ కి యూత్ ఫిదా అయిపోయారు. ఇక మిల్కీ తో రాజా కెమిస్ట్రీ ఓ లెవల్లో పండడం వల్ల బాక్సాఫీస్ కలెక్షన్లకు అది కలిసొచ్చింది. ఇప్పుడు త్రినాథరావు మరోసారి తమన్నానే ఎంపిక చేస్తుండడం ఆసక్తికరం. రాజా ఎనర్జీకి మిల్కీ డ్యాన్సింగ్ మూవ్స్ యాడైతే కిర్రాకే అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే శ్రుతిహాసన్.. తమన్నా.. త్రిష రేంజు సీనియర్స్ మాత్రమే మాస్ మహారాజాకు కుదురుతుండడం మరో ఇంట్రెస్టింగ్ టాస్క్.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-