కెమెరా ఆఫ్ చేస్తేనే.. భార్యభర్తలట!

0

కెమెరా ఆన్ లో ఉన్నంత సేపూ తామిద్దరం భార్యా భర్తలు కాదని కేవలం నటీనటులం మాత్రమే అని ఒక్క సారి కెమెరా ఆఫ్ చేశా కే తామిద్దరం భార్యా భర్తలమని అంటోది దీపికా పదుకునే. తన భర్త రణ్ వీర్ సింగ్ తో తన అనుబంధాన్ని వివరిస్తూ దీపిక ఈ వ్యాఖ్యానం చేసింది. ఇప్పటికే వివిధ సినిమాల్లో కలిసి కనిపించిన ఈ జంట ఇప్పుడు మరో సినిమా లో జంట గా కనిపిస్తోంది.

కపిల్ డెవిల్స్ ప్రపంచకప్ విజయం ఆధారం గా రూపొందుతున్న ‘1983’ సినిమాలో కపిల్ దేవ్ గా రణ్ వీర్ కపిల్ భార్యగా దీపిక నటిస్తోంది. ఇదే సమయం లో ఈ జంట తమ తొలి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఇలాంటి నేపథ్యం లో తమ బంధం గురించి దీపిక వివరించింది.

పలు హిట్ సినిమాల్లో కలిసి నటిస్తున్న దశ లోనే వీళ్లిద్దరూ ప్రేమ లో పడ్డారు. తమ ప్రేమ గురించి అధికారికం గా ఏమీ ప్రకటించకుండానే చాలా కాలం పాటు అలా కొనసాగారు. ఉన్నట్టుండి పెళ్లి చేసుకున్నారు.

వివాహం తర్వాత కూడా దీపిక ఎంచక్కా కెరీర్ కొనసాగుతూ ఉంది. రణ్ వీర్ కెరీర్ అదే స్థాయి లో సాగుతూ ఉంది. ఇప్పుడు కలిసి నటిస్తూ జంట గా భారీ పారితోషకాలను ఇంటికి పట్టుకెళ్తున్నారు వీరు.

వివాహ వార్షికోత్సవం సందర్భం గా తిరుమల శ్రీవారి ని కూడా దర్శించుకుంది ఈ జంట. దిగ్విజయం గా మొదటి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ తమ బంధం గురించి వివరిస్తున్నారు వీరిద్దరూ!
Please Read Disclaimer