ట్రైలర్ టాక్: ఊరంతా అనుకుంటున్నారు

0

ఊరి కట్టుబాట్లు కాటికి అమ్మేసే టైమ్ వచ్చింది….!! పచ్చని పల్లెటూళ్లలో విలువలకు పాతరేసి పూర్తిగా రాజకీయాలు కమ్మేశాయి. నాటి నుంచి ఆంధ్రా-తెలంగాణ అనే తేడా లేకుండా పల్లెలన్నీ అయోమయంలో పడిపోయాయి. మూడు పంటలు పండే గోదారి జిల్లాల్లో పల్లెల్ని రాజకీయాలు అయితే ఫ్యాక్షన్.. రౌడీయిజంతో సర్వనాశనం చేశాయనే చెప్పాలి. ధనార్జనతో పాటు విలువలు పతనమయ్యాయి. అయితే మారిన కుటుంబ విలువలు … పతనమైన వ్యవస్థను చూపిస్తూ మంచి కుటుంబాలు ఎలా ఉండాలి బంధాలు అనుబంధాలు ఎలా ఉండాలి? అన్నది చూపిస్తూ.. ఇప్పటికే పలు సినిమాలు వచ్చి విజయం సాధించాయి. కొత్త బంగారు లోకం.. శతమానం భవతి ఈ తరహాలోనే వచ్చాయి. గోదారి నేటివిటీ ప్రతిసారీ ఎంతో కొత్తగా కనిపించి తెరపై చూస్తున్నంత సేపూ ఆహ్లాదాన్ని పంచుతుంది.

ఇదిగో అదే పంథాలో మరో సినిమా వస్తోంది. ఊరంతా అనుకుంటున్నారు అనేది టైటిల్. సీనియర్ నరేష్ కుమారుడు నవీన్ కథానాయకుడు. అవసరాల శ్రీనివాస్ అరవదేశం నుంచి వచ్చిన మరో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇద్దరు కొత్తమ్మాయిలు ఆ ఇద్దరి సరసన నటిస్తున్నారు. రాధాకృష్ణన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇందులో రావు రమేష్ తనదైన శైలి నటనతో ఆకట్టుకోనున్నారని తాజాగా రిలీజైన ట్రైలర్ చెబుతోంది. రావు గారి పంచ్ లు ఆకట్టుకుంటున్నాయి.

ట్రైలర్ ఆద్యంతం పల్లె పట్టు పచ్చదనం.. గోదారి పరిసరాల్లోని అందచందాలు అలరిస్తున్నాయి. పల్లెల్లోని సాంప్రదాయం ఎంతో అందంగా కనిపిస్తోంది. కట్టుబాట్లు కాటికి అమ్మేసే టైమొచ్చింది అంటూ రావు రమేష్ వేస్తున్న పంచ్ కి సహజనటి జయసుధ పంచ్ అదిరిపోయింది. అమ్మా గౌరీ.. అరవోడితో చెన్నపట్నం చెక్కెయ్.. ఎంచక్కా రామ్ రాజ్ బనియన్ లు చెడ్డీలు అమ్ముకుని బతికేయొచ్చు.. అంటూ రావు రమేష్ డైలాగులు ఆకట్టుకున్నాయి. నవీన్ కృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్.. అవసరాల నటన ప్లస్ కానున్నాయి. కొత్తమాయిలు బాగానే సూటయ్యారు. బాలాజీ సానల దర్శకత్వం వహించారు. అక్టోబర్ 5న సినిమా రిలీజ్ కానుంది.
Please Read Disclaimer