షూటింగ్ పక్కన పెట్టి ఓపెనింగ్స్

0

అక్కినేని ఫ్యాన్స్ అఖిల్ 4వ సినిమా కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. అఖిల్ మూడవ సినిమా మిస్టర్ మజ్ను వచ్చి చాలా నెలలు అయ్యింది. అఖిల్ 4వ సినిమా చాలా ఆలస్యంగా మొదలైంది. గీతా ఆర్ట్స్ లో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెల్సిందే. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన అధికారిక అప్ డేట్ ఏమీ లేదు. మీడియాలో రకరకాలుగా వార్తలు అయితే వస్తున్నాయి.

షూటింగ్ ఎంత వరకు వచ్చింది.. ఫస్ట్ లుక్ ఎప్పుడు.. టీజర్ ఎప్పుడు అనే విషయాలపై క్లారిటీ రావడం లేదు. ఈ చిత్రంలో అఖిల్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెల్సిందే. వీరిద్దరు షూటింగ్స్ తో బిజీగా ఉన్నారనుకుంటున్న సమయంలో నేడు కాకినాడలో ప్రత్యక్షం అయ్యారు. కాకినాడలో అఖిల్ 4 సినిమా షూటింగ్ కు రాలేదు. అఖిల్ మరియు పూజా హెగ్డేలు ఇద్దరు కూడా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ను కాకినాడలో ఓపెన్ చేసేందుకు వెళ్లారు.

ప్రత్యేక విమానంలో అఖిల్ మరియు పూజా హెగ్డే కాకినాడలో ల్యాండ్ అయ్యారు. అక్కడ నుండి కాకినాడ మెయిన్ రోడ్ కు వెళ్లి అక్కడ భారీ జనాల సమక్షంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కొత్త షాప్ ను ఓపెన్ చేయడం జరిగింది. వీరిద్దరు కూడా షూటింగ్ ను పక్కన పెట్టి ఇలా ఓపెనింగ్స్ అంటూ తిరిగితే సినిమా పూర్తి అయ్యేది ఎప్పుడంటూ కొందరు అక్కినేని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరికొందరు మాత్రం వీరిద్దరిని కలిపి చూస్తే అఖిల్ 4 మూవీ ఫస్ట్ లుక్ ను చూసినట్లుగా అనిపిస్తుందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అఖిల్ మరియు పూజా హెగ్డేలు చాలా ట్రెడీషనల్ లుక్ లో ఆకట్టుకున్నారు. వీరిద్దరి కలయిక ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇద్దరి జంట చాలా బాగుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Please Read Disclaimer