గోల్డ్ ఫిష్ ట్రైలర్

0

కశ్మీర్ బార్డర్ .. తీవ్రవాదం నేపథ్యంలో వరుసగా సినిమాలొస్తున్నాయి. అగ్ర కథానాయకులు సహా నవతరం స్టార్లు దేశభక్తి కాన్సెప్టుతో సినిమాల్లో నటిస్తున్నారు. అయితే ఇదే వెల్లువలో దేశభక్తి.. తీవ్రవాదం నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా ఆపరేషన్ గోల్డ్ ఫిష్. ఆది సాషా చెత్రి (ఎయిర్ టెల్ మోడల్) నిత్యా నరేష్ ప్రధాన తారాగణంగా సాయి కిరణ్ అడివి దర్శకత్వంలో రూపోందుతున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది.

దసరా సందర్భంగా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇండియన్ ఆర్మీ నేపథ్యంలో.. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రమిదని దర్శకులు తెలిపారు. ట్రైలర్ ఆసక్తికరంగానే ఉంది. ఎన్ఎస్జీ (నేషనల్ సెక్యూరిటీ గార్డ్) కమాండో అర్జున్ పండిట్ పాత్రలో ఆది నటించాడు. ఇండియా-పాకిస్తాన్ బార్డర్ లో ఆపరేషన్ ఏమిటి? అన్నది ఆసక్తికరంగానే ఉంది. ఒక్కసారి జైహిందే మా జీహాద్ అయితే.. కుదీ సోచ్లో అంటూ ఆది పంచ్ లు బాగానే విసురుతున్నాడు. ట్రైలర్ కి శ్రీ చరణ్ పాకాల అందించిన రీరికార్డింగ్ అస్సెట్.

ఆదికి ఇటీవల హిట్లు లేవు. కొత్తదనం లేకపోతే ఎలా? అనుకుని ఇలా బార్డర్ నేపథ్యంలో సినిమాని ఎంచుకున్నాడని అర్థమవుతోంది. అయితే గోల్డ్ ఫిష్ వేటలో ఎంతవరకూ సఫలమయ్యాడు? అన్నది థియేటర్లలో చూసి చెప్పాల్సి ఉంది. సాయికిరణ్ అడివి చాలా గ్యాప్ తర్వాత తీస్తున్న చిత్రమిది. అంతకంతకు ఆలస్యమవుతోంది. ఇక ఈ నెలలోనే రిలీజ్ బరిలో దిగుతున్నారు. అక్టోబర్ 18న సినిమా విడుదల కానుంది. జైపాల్ రెడ్డి ఛాయాగ్రహణం అందించారు. వినాయకుడు టాకీస్ యూ&ఐ ఎంటర్టైన్మెంట్స్.. సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Please Read Disclaimer