ఒరేయ్ బుజ్జిగా టీజర్ టాక్

0

వరుసగా ఫ్లాప్ లు వస్తున్నా కూడా రాజ్ తరుణ్ మాత్రం వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇటీవలే ఇద్దరి లోకం ఒక్కటే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాజ్ తరుణ్ నిరాశ పర్చాడు. రెండు నెలల గ్యాప్ లోనే రాజ్ తరుణ్ ఒరేయ్ బుజ్జిగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. విజయ్ కుమార్ కొండ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రాజ్ తరుణ్ కు జోడీగా మాళవిక నాయర్ మరియు హెబ్బా పటేల్ నటించారు.

తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. టీజర్ లో రాజ్ తరుణ్ రెండు ప్రేమ కథలు చూపించారు. సినిమా మెయిన్ స్ట్రీమ్ పై క్లారిటీ ఇవ్వకున్నా రాజ్ తరుణ్ రెండు ప్రేమ కథలు నడిపినట్లుగా టీజర్ చూస్తుంటే అనిపిస్తుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల మాదిరిగా కామెడీ మరియు లవ్ సీన్స్ సినిమాలో ఉంటాయనిపిస్తుంది. స్టోరీ లైన్ మాత్రం మూసగా ఉండేలా అనిపిస్తుంది.

ఈ సినిమా రాజ్ తరుణ్ కు చాలా కీలకం. ఆయన కెరీర్ లో ఇప్పటికే చాలా ఫ్లాప్ లు చవిచూశాడు. ఇది కూడా అదే కోవలోకి వెళ్లే ఆఫర్లు రావడమే కష్టం అవుతుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గుండెజారి గల్లంతయ్యిందే చిత్రంతో హిట్ దక్కించుకున్న విజయ్ కుమార్ కొండ మరో హిట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. మరి ఈ చిత్రంతో అయినా సక్సెస్ ను అందుకుంటాడో చూడాలి.
Please Read Disclaimer