Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఆస్కార్ వస్తే… జక్కన్న ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఆస్కార్ వస్తే… జక్కన్న ఇంట్రెస్టింగ్ కామెంట్స్


టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన జక్కన్న సినిమా ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఇండియన్ సినిమా కు ఖ్యాతిని తీసుకు వచ్చే విధంగా గౌరవాన్ని దక్కించుకుంటూ ఉంది.

ఇటీవల టొరొంటో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో రాజమౌళి పాల్గొని ఆర్ ఆర్ ఆర్ సినిమా విశేషాలను అక్కడి వారితో మీడియాతో షేర్ చేసుకున్నాడు. అతి పెద్ద స్క్రీన్ పై అక్కడి ప్రేక్షకులతో కలిసి ఆర్ ఆర్ ఆర్ సినిమా ను చూశారు. ఆ సమయంలో ప్రేక్షకుల స్పందన కు సర్ ప్రైజ్ అయ్యాడట. ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమాకు ఆస్కార్ ఖాయం అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో జక్కన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఆర్ ఆర్ ఆర్ సినిమా కు ఆస్కార్ వచ్చినంత మాత్రాన తన తదుపరి సినిమాల యొక్క వ్యూహాలు మారవు అన్నట్లుగా జక్కన్న క్లారిటీ ఇచ్చాడు. అంటే ఆస్కార్ అవార్డు వస్తే హాలీవుడ్ లో సినిమాలు చేయడం లేదంటే హిందీలో సినిమాలు చేయడం వంటివి చేయను అని ఆయన క్లారిటీ ఇచ్చాడు. ముందస్తుగా తాను అనుకున్న ప్రకారమే ఆస్కార్ వచ్చినా ముందుకు సాగుతాను అన్నాడు.

ఇక ఆస్కార్ అవార్డు మా సినిమాకు వస్తే కేవలం ఆర్ ఆర్ ఆర్ టీమ్ కి మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న ఫిల్మ్ మేకర్స్ కి గొప్ప బూస్ట్ ను ఇస్తుందని జక్కన్న అభిప్రాయం వ్యక్తం చేశాడు. అంతర్జాతీయ స్థాయిలో సినిమాకు మంచి గుర్తింపు రావడం అనేది ప్రతి ఒక్క నటీ నటులకు మరియు సాంకేతిక నిపుణులకు గౌరవం అన్నట్లుగా జక్కన్న అభిప్రాయం వ్యక్తం చేశాడు.

ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు కొమురం భీమ్ మరియు అల్లూరి సీతా రామ రాజు పాత్రల్లో నటించిన ఈ సినిమాలో ఆలియా భట్.. అజయ్ దేవగన్.. శ్రియ ఇంకా పలువురు నటీ నటులు ఉన్నారు. సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి అంటూ అంతర్జాతీయ స్థాయి సినీ ప్రముఖుల తో కూడా టాక్ దక్కించుకుంది.

ఈ సినిమా ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్నా కూడా ఇండియన్ సినిమా కు చాలా పెద్ద విషయం అన్నట్లే. ముందు ముందు మరిన్ని ఆర్ ఆర్ ఆర్ వంటి సినిమా వచ్చేందుకు జక్కన్న అన్నట్లుగా బూస్ట్ ఇచ్చినట్లు అవుతుందని అంతా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.