ఆయన ఉస్మానియాను వదలడట

0

ఉస్మానియా యూనివర్శీటి చరిత్ర ఎంతో గొప్పది. ఈ వర్శిటీకి స్వాంతంత్య్రం రాక ముందే పునాది రాయి పడింది. వందేళ్ల చరిత్ర ఉన్న గొప్ప విశ్వ విద్యాలయం ఇది. ఎందరో శాస్త్రవేత్తల్ని.. మేధావుల్ని భారతదేశానికి అందించిన ఘనత ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన ప్రప్రథమ విశ్వవిద్యాలయం కూడా ఇదే. హైదరాబాద్ లో స్థాపించిన కొన్ని కళాశాలలు రాజ కుటుంబీకులకు.. సంపన్న వర్గాలకు మాత్రమే అందుబాటులో ఉన్న సమయంలో ప్రారంభమైంది. ఉన్నత విద్యను అన్ని సామాజిక వర్గాలకు అందించాలనే ఉద్దేశంతో బ్రిటిష్ ప్రభుత్వం 1913 లో తమ పాలనలో వున్న ప్రాంతాలలోనే గాక సంస్థానాలలో కూడా విశ్వవిద్యాలయాలను స్థాపించాలని భావించి ఏర్పాటు చేసిన యూనివర్శిటీ ఇది. తర్వాత కాలక్రమేణా ఉద్యమాలకు పురిట గడ్డగా మారింది.

ఉస్మానియాలో ఎన్నో విద్యార్ధి ఉద్యామాలు సాగాయి. నేటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటవ్వడానికి ప్రధాన కారణం ఓయూనే. ఇక్కడ చదువుకునే విద్యార్ధుల ఉద్యమాలే అనడంలో సందేహం లేదు. ఎందరో ఓయూ విద్యార్ధుల బలిదానాల వల్లనే తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చింది. ఇప్పుడా యూనివర్శిటీ పేరు జార్జిరెడ్డి చిత్రం వల్ల మరోసారి మార్మోగుతోంది. 1970 దశకంలో జార్జిరెడ్డి అనే విద్యార్ధి నాయకుడు చేగువేర స్ఫూర్తితో `రెయిజ్ ద వాయిస్` అంటూ ఉద్యమం ప్రారంభిస్తే అది ఇప్పటికీ ప్రతి ఓయూ విద్యార్ధి గుండెల్లో నాటుకుపోయింది.

ఇప్పటికీ ఆయన స్ఫూర్తితోనే ఉద్యమాలు జరుగుతున్నాయి. తమ హక్కులను కాపాడుకోగలుగుతున్నారు. ఓయూలో ఏ విద్యార్ధిని అడిగినా జార్జిరెడ్డి గురించి ఎంతో గొప్పగా చెబుతారు. ఆయన స్థాపించిన పీ.డీ.ఎస్.యూ ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలు జరిగాయి. నేటికీ జరుగుతున్నాయి. ఇటీవల విడుదలైన జార్జిరెడ్డి బయోపిక్ ఎన్నో విషయాలపై జనాల్లో అవగాహన పెంచింది. ఇక ఈ సినిమా తీసిన దర్శకుడు జీవన్ రెడ్డి యూనివర్శిటీనీ వదిలి పెట్టనని చెబుతున్నారు. జార్జి రెడ్డి లాంటి కథలు ఇంకా ఈ వర్శిటీలో చాలానే ఉన్నాయి. వాటన్నింటిని సినిమాగా తీసి విద్యార్ధుల్లో చైతన్యం నింపుతానని అంటున్నాడు. ఉద్యమం స్ఫూర్తితో తీసేవి ఆసక్తిని పెంచుతాయి. అయితే తప్పిదాలు లేకుండా కమర్షియల్ పంథాలో తీసి మెప్పించడం చాలా కష్టం. జార్జిరెడ్డిలో స్క్రీన్ ప్లే రొటీన్ అన్న విమర్శలొచ్చాయి. మరి జీవన్ రెడ్డి మరో ప్రయత్నం చేస్తే పాత తప్పిదాలు రిపీటవ్వకుండా చేస్తాడేమో చూడాలి.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home