ఫాదర్స్ డే : సూపర్ స్టార్ గురించి సూపర్ కిడ్స్

0

నేడు వరల్డ్ ఫాదర్స్ డే. ఈ సందర్బంగా టాలీవుడ్ ప్రముఖులు తమ తండ్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియా ద్వారా చిరంజీవి.. మహేష్ బాబుతో పాటు పలువురు స్టార్స్ తమ తండ్రుల ఫొటోలు షేర్ చేసి ఈ సందర్బంను అభిమానులతో పంచుకున్నారు. ఇదే సమయంలో మహేష్ బాబు పిల్లలు గౌతమ్ మరియు సితారలు కూడా తమ తండ్రికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు.

ఫాదర్స్ డే సందర్బంగా ప్రముఖ దిన పత్రికతో గౌతమ్ ఇంకా సితారలు మాట్లాడుతూ… ఈ మూడు నెలల సమయంలో నాన్నతో చాలా మంచి సమయం గడిపాం. ప్రతి రోజు నాన్నతో లూడో.. స్నేక్స్ అండ్ లేడర్ గేమ్ ఇంకా పలు గేమ్స్ ఆడుతూ ఈ టైంను ఎంజాయ్ చేస్తున్నామన్నారు. ఫాదర్స్ డే సందర్బంగా మేము నాన్నకు ప్రత్యేకంగా సొంతంగా డిజైన్ చేసిన గ్రీటింగ్ కార్డ్ ను అందజేశాం. మేము ఏం చేసినా కూడా నాన్న మమ్ములను అభినందిస్తూ ప్రోత్సహిస్తూ ఉంటారు. డాడీ ఈజ్ ది బెస్ట్ అంటూ సితార ఇంకా గౌతమ్ లు మహేష్ బాబు గురించి పేర్కొన్నారు.
Please Read Disclaimer