కారవ్యాన్ వెనక ఆయన కథేంటి?

0

టాలీవుడ్ లో అగ్ర హీరోలంతా కారవ్యాన్ లు సొంతంగా మెయింటెయిన్ చేస్తున్నారు. మహేష్ రామ్ చరణ్ ఎన్టీఆర్ ఇప్పటికే సొంత కారవ్యాన్ లను కలిగి ఉన్నారు. ఈ కారవ్యాన్ సౌలభ్యం ఎంత? అంటే ఆన్ లొకేషన్ ఐదు నక్షత్రాల హోటల్ ఉన్నంత సౌకర్యం. వీటికి స్ఫూర్తి ఎవరు? అంటే.. సల్మాన్ షారూక్ కారవ్యాన్ (వ్యానిటీ వ్యాన్) పరిశీలించి అదే నిపుణుడి వద్ద మన స్టార్లు కారవ్యాన్ లు తయారు చేయించారు. రామ్ చరణ్ తన కారవ్యాన్ కోసం 8 కోట్లు ఖర్చు చేయడం ప్రముఖంగా చర్చకు వచ్చింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్- అశోక్ లేల్యాండ్ కారవ్యాన్ ఉంది. ఇందులో సకల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. మహేష్ కి సకల సౌకర్యాలతో ఖరీదైన కారవ్యాన్ ఉంది. సల్మాన్ షారూక్ రేంజులో దీనిని డిజైన్ చేయించుకున్నారని అప్పట్లో (సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు టైమ్లో) ప్రచారమైంది.

ఇప్పుడు బన్ని కూడా అదే తయారీ దారు వద్ద అల్ట్రా మోడ్రన్ స్టైల్లో కారవ్యాన్ తయారు చేయిస్తున్నారట. ఇందుకోసం ఏకంగా 7-8 కోట్లు ఖర్చవుతోందని ఇటీవల వార్తలు వచ్చాయి. మారిన లేటెస్ట్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని అల్ట్రా మోడ్రన్ ఫెసిలిటీస్ తో బన్ని వ్యానిటీ వ్యాన్ రెడీ చేయిస్తున్నారట. అందుకోసం బన్ని ముంబైకి వెళుతున్నారని ప్రచారమవుతోంది. ఇంతకీ వీళ్లందరికీ కారవ్యాన్ తయారు చేసే నిపుణుడు కం టెక్నీషియన్ ఎవరు? అతడి అర్హత ఏంటి? అంటే ఆసక్తికర విషయాలు తెలిసాయి. కింగ్ ఖాన్ షారూక్ – సల్మాన్ లకు కారవ్యాన్ డిజైన్ చేసిన దిలీప్ అనే కస్టమ్ మేడ్ డిజైనర్ వీళ్లందరికీ కారవ్యాన్ తయారు చేస్తున్నారు. ఆల్మోస్ట్ 5స్టార్ ఫెసిలిటీస్తో కారవ్యాన్ ని తీర్చిదిద్దడం రీమోడల్ చేయడంలో అతడు సిద్ధహస్తుడు.

దిలీప్ చాబ్రియా అనే ఆ పెద్దాయన ఇండస్ట్రీ బెస్ట్ రీమోడలింగ్ డిజైనర్ అని తెలుస్తోంది. అతడి వద్దకు వచ్చిన ఏ కార్ ని అయినా బస్ స్కూటర్ లేదా ఎలాంటి వాహనం వచ్చినా అతడు దానిని కస్టమర్ కి అనుకూలంగా మార్చేయగలరు. ఎయిర్ క్రాఫ్ట్ అయినా అతడి చేతి మాట వినాల్సిందేనట. అతడికి చిన్నప్పటి నుంచి కార్లు అంటే ఫ్యాషన్. ఆ ఫ్యాషన్ వల్లనే అతడు `ఆర్ట్ సెంటర్ కాలేజ్ ఆఫ్ డిజైన్ – అమెరికా`లో ప్రత్యేకించి డిజైనింగ్ కోర్స్ చేశారు. కామర్స్ లోనూ డిగ్రీ పూర్తి చేసారు.
Please Read Disclaimer