ప్రపంచంలోనే టాప్100లో మన రచయితలు

0

ఆధునిక సాంకేతిక విప్లవంలో ఇప్పుడు నవలలు కథలు రచనలు చదివే అలవాటు పూర్తిగా తగ్గిపోయింది. కానీ ఓ 20 ఏళ్ల కిందటి వరకు వీటికి విపరీతమైన ఆదరణ ఉండేది. అయితే ఎవర్ గ్రీన్ రచనలు ఎన్నో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ ప్రాచుర్యం పొందుతూనే ఉన్నాయి. ‘హారీపోటర్’ నవలలు ప్రస్తుతం ప్రపంచాన్ని ఊపేస్తున్న నవల ఖండం. దీనిపై సినిమాలు కూడా వచ్చేశాయి.

ఆంగ్ల భాషలో తొలి నవల ‘రాబిన్సన్ క్రూసో’. ఇది ప్రచురితమై 300 ఏళ్లు పూర్తవడంతో తాజాగా ప్రఖ్యాత మీడియా దిగ్గజం ‘బీబీసీ’ ప్రపంచంలోనే టాప్ 100 రచనలను ఎంపిక చేసింది. ఓ నిపుణుల కమిటీని వేసి ప్రేమ రాజకీయం అధికారం బాలసాహిత్యం సమాజం వంటి పది కేటగిరిల్లో రచనలను పరిశీలించింది.

బీబీసీ నిపుణులు ఎంపిక చేసిన ప్రపంచ ప్రఖ్యాత రచయితల జాబితాలో భారత్ కు చెందిన ప్రముఖ రచయితలు ఆర్కే నారాయణ్ అరుంధతి రాయ్ సల్మాన్ రష్డీ విక్రమ్ సేత్ రచనలను చోటు దక్కడం విశేషం. వీరి రచనలు ప్రపంచంలోనే మేటి అని కితాబిచ్చాయి.

*టాప్ 100లో చోటు దక్కిన భారతీయ రచయితలు.. వారి రచనలు ఇవే..
-అరుంధతీ రాయ్ -‘ది గాడ్ ఆఫ్ స్మాల్ థింక్స్’(ఐడేంటి కేటగిరిలో ఉత్తమ రచన)
-ఆర్కే నారాయణ్- ‘స్వామి అండ్ ఫ్రెండ్స్’ (కమింగ్ ఆఫ్ ఏజ్ విభాగంలో )
-సల్మాన్ రష్దీ -’ది మూర్స్ లాస్ట్ సై’ (రూల్స్ బ్రేకర్స్ విభాగంలో)
-విక్రమ్ సేథ్ -‘ఏ స్యూటబుల్ బోయ్’ (ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్ షిప్ విభాగంలో)
-వీఎస్ నైపాల్ – ‘ఏ హౌస్ ఆఫ్ మిస్టర్ బిశ్వాస్’ (క్లాస్ అండ్ సొసైటీ విభాగంలో)Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home