ఓవర్సీస్: సంక్రాంతి బయ్యర్ల కు పట్టపగలే చుక్కలు!

0

సంక్రాంతి సీజన్లో రిలీజ్ కానున్న సినిమాల పోటీ ఇప్పుడు జటిలంగా మారిన సంగతి తెలిసిందే. ముందు అనుకున్న డేట్ల ప్రకారం విడుదలైతే ఎవరికీ సమస్యలు ఉండవు కానీ ఇప్పుడు డేట్స్ మారడం తో డిస్ట్రిబ్యూటర్లు.. బయ్యర్ల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయట. సినిమాలపై బజ్ ఉంది.. సూపర్ క్రేజ్ ఉందని భారీ మొత్తాలకు రైట్స్ తీసుకుంటే ఇప్పుడేమో ఈ అనవసరమైన పోటీల వల్ల తమకు నష్టాలు తప్పేలా లేవని భయపడుతున్నారట.

ఓవర్సీస్ విషయమే తీసుకుంటే డిస్ట్రిబ్యూటర్లకు ఈమధ్య లాభాలు తీసుకు వచ్చిన పెద్ద సినిమాలు లేనే లేవు. ఇలాంటి పరిస్థితిలో సంక్రాంతి సినిమాల మీద ఆశలు పెట్టుకుంటే ఇప్పుడు అది కాస్తా రివర్స్ అయ్యేలా ఉందని బాధపడుతున్నారట. ముందు ప్రకటించిన డేట్స్ ప్రకారం ఇప్పటికే పెద్ద బిజినెస్ క్లోజ్ అయిందని. ఎడ్వాన్స్ బుకింగ్స్ కూడా పెద్ద ఎత్తున జరిగాయని అంటున్నారు. అంతే కాదు.. డిస్ట్రిబ్యూటర్లు పబ్లిసిటీ కోసం కూడా చాలా ఖర్చు పెడుతున్నారట. నిర్మాతల వైపు నుంచి కూడా ప్రచారానికి డబ్బు ఖర్చు పెట్టాల్సింది గా ఒత్తిడి చేస్తున్నారట. అయితే ఈ సమయం లో ఉన్నట్టుండి రిలీజ్ డేట్ మార్పు గురించి సమాచారం ఇవ్వడంతో వారికి ఏం చెయ్యాలో పాలుపోవడం లేదట.

రిలీజ్ డేట్ మార్చినందువల్ల థియేటర్ లీజ్ అగ్రిమెంట్స్ లో మార్పు చేయాల్సి ఉంటుంది. ఎడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వారికి ఇపుడు మనీ తిరిగివ్వాలి. లేదా ముందు డేట్ కు ఆ టికెట్ ను ఇవ్వాలి. ఈ గోల మనకెందుకని ఎంతమంది ప్రేక్షకులు టికెట్స్ పూర్తిగా క్యాన్సిల్ చేసుకుంటారో అనేది తెలియదు. పెద్ద హీరోల సినిమాలు.. సంక్రాంతి సీజన్ కదా లాభాలు వస్తాయి అన్న ఆశతో రంగంలోకి దిగితే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు.. బయ్యర్లు లేనిపోని చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తోందని అంటున్నారు. హీరోల ఈగోల వల్ల ఓవర్సీస్ మార్కెట్ మెరుగయ్యే అవకాశం కూడా చేజారిపోతోందని ట్రేడ్ వర్గాల వారు వ్యాఖ్యానిస్తున్నారు.
Please Read Disclaimer