లేటు వయసు లో న్యూడ్ గా ఫోజులిచ్చి సెగలు రేపింది

0

వివాదాలకు బ్రాండ్ అంబాసిడర్ల ను ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేసినంతనే.. కొందరి పేర్లు చప్పున స్ఫూరిస్తుంటాయి. ఆ కోవకే చెందుతారు హాలీవుడ్ స్టార్ పద్మా లక్ష్మి. భారత సంతతికి చెందిన ఈ నటి తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. నటిగానే కాదు.. మోడల్ గా.. రైటర్ గా.. యాంకర్ గా ఆమెకున్న టాలెంట్లు అన్ని ఇన్ని కావు. ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యుసర్ గా వ్యవహరిస్తున్న ఆమె వేసే ప్రతి అడుగు వివాదంగా మారుతూ ఉంటుంది.

తన కంటే 30 ఏళ్ల పెద్దవాడైన సల్మాన్ రష్దీ రచయితతో డేటింగ్ చేసి.. తర్వాత పెళ్లి చేసుకున్న ఆమె.. తర్వాతి కాలంలో విడాకులు తీసుకొని విడిపోయారు. తర్వాత పలువురితో డేటింగ్ చేసిన ఆమె.. ఒక అమ్మాయికి తల్లి అయ్యారు. అయితే.. తండ్రి ఎవరో తెలుసుకోవటం కోసం ఆ పాపకు డీఎన్ఏ టెస్టు చేసిన ఘనత పద్మాలక్ష్మీకే చెల్లుతుంది. అలా ఆ పాప తండ్రి ఆడమ్ డెల్ అని తేలింది.

ఉన్నట్లుండి పద్మా లక్ష్మీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటారా? అక్కడికే వస్తున్నాం. యాభై ఏళ్ల వయసు లో ఒంటి మీద నూలుపోగు లేకుండా ఆమె చేసిన తాజా ఫోటో షూట్ ఇప్పుడు సెగలు రేపుతోంది. లేటు వయసులో ఘాటు ప్రేమ గా.. ఇంత వయసు లోనూ బింకం సడలని అందాలతో చెలరేగి పోయిన అమ్మడి ఫోటోలు ఇప్పుడు హాట్ హాట్ గా మారాయి. పద్మాలక్ష్మా.. మజాకానా?
Please Read Disclaimer