పాగల్ పంతి ట్రైలర్

0

బాలీవుడ్ లో వింత వింతైన కామెడీ సినిమాలు తెరకెక్కుతున్నాయి. టోటల్ ధమాల్.. హౌస్ ఫుల్ 4.. దోస్తానా 2 వగైరా వగైరా ఈ తరహానే. ఇప్పుడు ‘పాగల్ పంతి’ మరో రకం కామెడీ. జాన్ అబ్రహాం-అర్షద్ వార్షీ-పులకిత్ సామ్రాట్ – అనీల్ కపూర్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. రైటర్ టర్న్ డ్ డైరెక్టర్ అనీష్ బజ్మీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా రిలీజైన ట్రైలర్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది.

ఇందులో మ్యాడ్ క్యాప్ కామెడీ హైలైట్ గా నిలవనుంది. ఇందులో జాన్ అబ్రహాం రొమాంటిక్ కాన్ మ్యాన్ గా నటిస్తున్నాడు. బాగా డబ్బున్న గ్యాంగ్ స్టర్స్ పై ఓ మిషన్ కి ప్లాన్ చేస్తాడు జాన్. ఇక ఈ మిషన్ లో అతడితో పాటుగా అర్షద్ వార్షీ- పులకిత్ సామ్రాట్ పాల్గొంటారు. ఆ ముగ్గురి కామెడీతో ట్రైలర్ ఆద్యంతం రక్తి కట్టిస్తోంది. థియేటర్ లో ప్రేక్షకులు పడి పడి నవ్వుకునేలా ఈ సినిమా ఉండనుందని ఇదివరకూ దర్శకుడు తెలిపారు. అందుకు తగ్గట్టే ఇది మరో ప్రామిస్సింగ్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఉండనుంది. లైట్ వెయిట్ జోకులతో పాటు టోటల్ ధమాల్ తరహాలో వీఎఫ్ ఎక్స్ బేస్డ్ థీమింగ్ కామెడీ ఆకట్టుకోనుంది. ఇందులో కృతి కర్భందా- ఇలియానా- ఊర్వశి రౌతేలా అందచందాలు కనువిందు చేయనున్నాయి.

ఇంతకుముందు అనీల్ కుమార్ రిలీజ్ చేసిన పోస్టర్లలో వైఫై భాయ్ పాత్రలో ఆయన పరిచయం అయ్యారు. వార్షీ పాత్రను జంకీ అని.. అలాగే సామ్రాట్ పాత్రను చందు అని పరిచయం చేశారు. సంజనగా ఇలియానా.. జాంగ్రీగా కృతి .. కావ్యగా ఊర్వశి మత్తెక్కించబోతున్నారు. సౌరభ్ శుక్లా రాజా సాహెబ్ అనే పాత్రలో నటిస్తున్నారు. జాన్ అబ్రహాం రాజ్ కిషోర్ అనే పాత్రలో కనిపిస్తారు. పోస్టర్లకే కాదు ఇప్పుడు ట్రైలర్ కి అద్భుత స్పందన వస్తోంది. కామెడీ రైటర్ గా ఆరంభమైన అనీష్ బజ్మి ఇప్పుడు దర్శకుడిగా సత్తా చాటుతున్న క్రమంలో ఈ సినిమాపైనా భారీ అంచనాలున్నాయి. టీసిరీస్ అధినేత భూషణ్ కుమార్ తో కలిసి పనోరమ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. నవంబర్ 22న ఈ చిత్రం రిలీజ్ కానుంది.
Please Read Disclaimer