యాంకర్ చెంప చెళ్లుమనిపించిన మంత్రి

0

అతనో ఉన్నత పదవి లో ఉన్న మంత్రి. అనుకోకుండా ఓ పెళ్లికి వెళ్లారు. అక్కడే ఓ యాంకర్ తారసపడటంతో చెంప చెళ్లుమనిపించాడు. అంతటితో ఆగకుండా జుట్టు పట్టుకుని మరీ దబిడి దిబిడిలాడించాడు. దెబ్బకు యాంకర్ అక్కడ నుంచి లగాయించేసిందంతే. దొరకబుచ్చుకుని మరీ చితక బాదాలని చూసాడు…కానీ తప్పించుకుని పారిపోయేసరికి ఆ మంత్రిగారు శాంతిచారు. లేదంటే ఆ యాంకర్ ని వెంటాడేవాడే.. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుంది? అంతగా ఆ మంత్రి గూబలు వాయించడానికి కారణం ఏంటి? అంటే అసలు వివరాల్లోకి వెళ్లాల్సిందే.

సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ప్రముఖ టిక్ టాక్ స్టార్ హరీమ్ షాతో తనకు సంబంధం అంటగట్టడమే మంత్రి ఆగ్రహానికి కారణమైంది. ఓ వివాహ వేడుకకు మంత్రి..అతనిపై ఆ సంబంధం అంటగట్టిన యాంకర్ వచ్చాడు. ఆ యాంకర్ ని చూసిన వెంటనే మంత్రి గారు దగ్గరకి వెళ్లి ఎలాంటి సమాధానం చెప్పకుండా చెంపలు వాయించేసాడు. ఎందుకు కొడుతున్నారని ప్రశ్నిస్తున్నా..మాట వినకుండా పిడుగుద్దులు గుద్దాడు. దెబ్బకి యాంకర్ పరారైన అనంతరం మంత్రి వివరణ ఇచ్చాడు.

మనుషులు ఉండొచ్చు… పోవచ్చు. కానీ మనమంతా మనుషులం. మనపై తప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు స్పందిస్తాం. అదీ వ్యక్తిగత ఆరోపణలు వచ్చినప్పుడు అస్సలు సహించలేం. నేను కొట్టాను అనడానికి అదే జవాబు అన్నారు. జర్నలిజం విలువల్ని కొందరు కాలరాస్తున్నారు. టీవీ యాజమాన్యాలు రేటింగ్ ల కోసం దిక్కుమాలిన కాన్సెప్ట్ లతో ప్రొగ్రామ్ లు చేస్తున్నారు. వాళ్ల సంగతి కూడా ఓసారి చూడాలన్నారు. గతంలో ఓ ఛానల్ యజమాని పై కూడా మంత్రిగారు ఇలాగే దాడి చేసారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది అంటే పాకిస్తాన్ లో అని తెలిసింది.
Please Read Disclaimer