మరీ 12 రోజులకే విడిపోవడం ఏంటి ఆంటీ?

0

హాలీవుడ్ స్టార్స్ ప్రేమ వ్యవహారాలు.. పెళ్లి.. విడాకులు ఇవి చాలా కామన్ గా మీడియాలో వినిపిస్తూనే ఉంటాయి. హాలీవుడ్ కు చెందిన పలువురు స్టార్స్ రెండు మూడు పెళ్లిల్లు చేసుకున్న వారు కూడా ఉన్నారు. ఇక హాలీవుడ్ స్టార్ నటి పమేలా ఆండర్సన్ 12 రోజుల క్రితం ప్రముఖ హాలీవుడ్ నిర్మాత జాన్ ను పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి ఆమెకు అయిదవ పెళ్లి.. అటు వైపు జాన్ కు కూడా ఇది అయిదవ పెళ్లి. వీరిద్దరి వయసు కూడా అయిదు పదులను క్రాస్ చేసింది. కనుక ఇప్పటికైనా వీరు ఒకరితో ఒకరు కలిసి ఉంటారని అంతా భావించారు.

పెళ్లి అయిన 12 రోజుల్లోనే తాను జాన్ ను వదిలేశాను అంటూ ఏకంగా మీడియా ముందే పమేలా ఆండర్సన్ ప్రకటించింది. జాన్ అంటే నాకు గౌరవం ఉంది. కాని మా ఇద్దరి జీవితాల్లో కాస్త కన్ఫ్యూజ్ ఉంది. మేము ఒకరి నుండి ఒకరం ఏం ఆశిస్తున్నాం అనేది తెలియడం లేదు. అందుకే ప్రస్తుతానికి ఇద్దరం విడి విడిగా ఉంటున్నాం. మళ్లీ కలుస్తామా లేదా అనేది కూడా తాను చెప్పలేను అంది.

ప్రస్తుతానికి పెళ్లిని రద్దు చేసుకునేందుకే ఈ జంట ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. కేవలం 12 రోజుల్లోనే జాన్ ను వదిలేయాలనేంతగా అతడు ఏం తప్పు చేశాడంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. పెళ్లికి ముందు చాలా కాలం లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఆ సమయంలో ఆయన గురించి తెలియలేదా అంటూ పమేలాపై కామెంట్స్ చేస్తున్నారు. 52 ఏళ్ల వయసులో ఆరవ పెళ్లికి సిద్దమవుతావా ఆంటీ అంటూ నెటిజన్స్ కొందరు ప్రశ్నిస్తున్నారు.