52 ఏళ్ల వయసులో శృంగార తారకు 4వ పెళ్లి

0

ఐదు పదులు దాటినా అమ్మడి అందం.. చందం రోమాన్స్ మాత్రం తగ్గడం లేదు. హాలీవుడ్ నటి పమేలా అండర్సన్ మరోసారి పెళ్లికి సిద్ధమవుతోంది. ఇప్పటికే మూడు సార్లు పెళ్లి చేసుకొని పెటాకులు తీసుకున్న ఈమె నాలుగోసారి పెళ్లికి రెడీ కావడం విశేషం.

పమేలా అండర్సన్ జనవరిలో హాలీవుడ్ నిర్మాత జాన్ పీటర్స్ ను పెళ్లి చేసుకున్నారనే వార్త హాలీవుడ్ లో సంచలనమైంది. ఇది ఆమెకు 5వ పెళ్లి అని కథనాలు వచ్చాయి. అయితే తనకు 4వ పెళ్లినే అని క్లారిటీ ఇచ్చింది. 52 ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లి చేసుకోవలని అనుకుంటున్నట్లు మీడియాలో తెలిపింది.

మూడు పెళ్లిళ్ల బ్రేకప్ తర్వాత మానసికంగా కృంగిపోయిన పమేలా ఇండియాకు వచ్చి పంచకర్మ యోగాతో మనసును తేలిక చేసుకొని వెళ్లింది. ఆ తర్వాత నిర్మాత జాన్ పీటర్స్ తో జతకట్టింది. ఈ సారి నాలుగో పెళ్లిని అయినా గాడిలో పెట్టి నా దాంపత్య జీవితాన్ని సాగనివ్వు దేవుడా అని పమేలా కోరుకుందట..

పమేలా గతంలో టామ్ లీ బాబ్ రిచీ రిక్ సాల్మన్ ను పెళ్లి చేసుకొని విడాకులు ఇచ్చింది. ఇప్పుడు నిర్మాత జాన్ తో జతకట్టింది. తాను రోమాంటిక్ అని.. ఈజీగా నా బుట్టలో పడుతారని.. అందుకే నాలుగో పెళ్లికి రెడీ అవుతున్నానని పమేలా చెప్పడం కొసమెరుపు.
Please Read Disclaimer