జక్కన్న నెక్స్ట్ సినిమాలో హీరో అతనేనా…?

0

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీ స్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ చిత్రంలో స్టార్ హీరోలైన జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో దేశవ్యాప్తంగా ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంది. బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్త క్రేజ్ సంపాదించుకున్న రాజమౌళి నుండి వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ వల్ల షూటింగ్ ఆపుకున్న ఆర్.ఆర్.ఆర్ తదుపరి షెడ్యూల్ ఏప్రిల్ నెలలో మొదలు కానుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ‘కొమరం భీమ్’ రోల్ చేస్తుండగా రామ్ చరణ్ ‘అల్లూరి సీతారామరాజు’ పాత్రలో కనిపించనున్నాడు. వచ్చే సంవత్సరం జనవరి 8న విడుదల కానున్న ఈ చిత్రాన్ని డివీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక రాజమౌళి ఆస్థాన సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

ఇదిలా ఉండగా ఇప్పుడు రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో తన తదుపరి చిత్రం చేస్తున్నట్లు ఈ చిత్రానికి కే ఎల్ నారాయణ నిర్మించబోతున్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ ఆ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన ఏదీ రాకపోవడంతో ఆ వార్త పుకారుగానే మిగిలిపోయింది. ఇప్పుడు తాజాగా దీని గురించి మరో పుకారు బయటకి వచ్చింది. ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ డిలే అవుతుండటంతో మహేష్ వేరే సినిమాలకు కమిట్మెంమ్ట్స్ ఇచ్చాడని అందువల్ల మహేష్ ఈ సినిమా చేయడం లేదని ఇండస్ట్రీలో అనుకుంటున్నారు. అంతేకాకుండా ‘ఇస్మార్ట్ శంకర్’ హిట్ తో మంచి ఊపు మీదున్న యంగ్ హీరో రామ్ తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంటుందని మరో పుకారు పుట్టుకొచ్చింది. ఇప్పటికే తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ను స్టోరీని డెవలప్ చెయ్యమని చెప్పారంట. కానీ నిజానికి రాజమౌళి తన నెక్స్ట్ సినిమా గురించి అస్సలు ఆలోచించడం లేదంట తన ఫోకస్ మొత్తం ఆర్ఆర్ఆర్ పై ఉన్నాయని సన్నిహిత వర్గాలు చెప్పుకుంటున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-