ఇప్పుడీ స్టూడియో ఏంటి ఆలీ భాయ్ ?

0

ఎప్పుడో 30 ఏళ్ళ క్రితం కమెడియన్ అలీని హీరోగా పెట్టి ఎస్వి కృష్ణారెడ్డి తీసిన యమలీల బ్లాక్ బస్టర్ కావడం స్టార్లు సైతం నోరెళ్లబెట్టి చూసేలా చేసింది. దాని దెబ్బకు ఓ పదేళ్లు ఆలీ హీరోగా ఎంతలేదన్నా సుమారుగా ముప్పై నలభై సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని డబ్బులు ఇచ్చాయి మరికొన్ని మబ్బులు వదిలించాయి. క్రేజ్ ఉన్న హీట్ లో ఇవన్నీ కామనే కాబట్టి నిర్మాతలు త్వరగా నిజాన్ని గుర్తించి మళ్ళీ తనను హాస్య పాత్రలకు పరిమితం చేశారు.

అప్పుడంటే హీరో ఏజ్ కాబట్టి ఆలీ ఏది చేసినా చెల్లింది. కానీ ఇప్పుడు అరవై పడికి దగ్గరగా ఉన్న ఆలీ హీరోగా మాస్ మసాలా సినిమా అంటే ఊహించగలమా. అలా అనుకుంటామనే కాబోలు పండుగాడు ఫోటో స్టూడియో అనే సినిమాతో ఆలీని హీరోగా కం బ్యాక్ చేయిస్తున్నారు. దీని టీజర్ విడుదలైంది. ఒక ఊళ్ళో ఫోటో స్టూడియో నడుపుకునే పండుగాడు అనే వ్యక్తికి లవ్ స్టోరీ దాని తర్వాత వచ్చే డ్రామా ఆపై జరిగే యాక్షన్ విన్యాసాలు వెరసి ఒక రొటీన్ మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందించినట్టు తెలుస్తోంది.

జీవా-బాబు మోహన్-వినోద్ కుమార్ లాంటి సీనియర్లు ఇందులో కీలక పాత్రలు చేయడం విశేషం. హీరోగా చేయడం తప్పు కాదు కానీ ఇంత లేట్ ఏజ్ లో ఇలాంటి మసాలా సినిమాలు చేయడమే వింత. రెగ్యులర్ గా ఏళ్ళ తరబడి హీరోగా ఉంటే ఇలాంటి కామెంట్స్ రావు. క్యారెక్టర్ రోల్సే తగ్గిన టైంలో ఇలా ఏకంగా ఇంత పెద్ద హీరో బిల్డప్ తో వస్తే పబ్లిక్ లో ఏవేవో అభిప్రాయాలు వచ్చేస్తాయి. పోనీ మేకింగ్ అయినా రిచ్ గా ఉందా అంటే దాని గురించి మాట్లాడుకోకపోవడం ఉత్తమం




Please Read Disclaimer