త్రిష నీకిది న్యాయమా?

0

ఒకప్పుడు హీరోయిన్స్ పై నిర్మాతల ఆధిపత్యం కనిపించేది. నిర్మాతలు ఇచ్చినంత తీసుకునే వారు.. నిర్మాతలు ఎక్కడ ఉంచితే అక్కడ ఉండే వారు. షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఎప్పుడు ప్రమోషన్స్ కు రమ్మంటే అప్పుడు వచ్చే వారు. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. హీరోయిన్ డేట్స్ కు తగ్గట్లుగా ప్రమోషన్ కార్యక్రమాలను ప్లాన్ చేసుకోవడంతో పాటు వారి గొంతెమ్మ కోర్కెలు అన్నీ తీర్చాల్చి వస్తుంది. ప్రతీది కూడా చాలా కట్టుదిట్టంగా హీరోయిన్స్ కండీషన్స్ పెడుతున్నా కూడా నిర్మాతలు ఓర్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు.

తాజాగా త్రిష తాను నటించిన పరమపదం విళైయాట్టు చిత్రం ప్రమోషన్ విషయంలో నిర్మాతలను ఇబ్బంది పెడుతుందట. సినిమా విడుదలకు సిద్దం అవుతుంది. ఇప్పటి వరకు ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించలేదు. ఇటీవలే ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసేందుకు నిర్మాతలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మొదట ఆ ప్రెస్ మీట్ కు వస్తానంటూ హామీ ఇచ్చిన త్రిష అదే తేదీకి మణిరత్నం సినిమా పొన్నియన్ సెల్వన్ చిత్రం టెస్ట్ షూట్ లో పాల్గొనేందుకు ఓకే చెప్పిందట.

ఒకే రోజు రెండు కార్యక్రమాలకు ఓకే చెప్పడంతో పరమపదం నిర్మాతలు ఆందోళన చెందుతున్నారట. పొన్నియన్ సెల్వన్ చిత్రం షూట్ పూర్తి చేసుకుని మీడియా సమావేశం సమయానికి అక్కడకు వస్తానంటూ నిర్మాతలకు త్రిష హామీ ఇస్తుందట. కాని నిర్మాతలు మాత్రం కాస్త అటు ఇటు అయినా కూడా ఇబ్బంది అనే ఆందోళనలో ఉన్నారు. అందుకే మీడియా మీట్ తేదీని మార్చుకుందాం అంటూ నిర్మాతలు ప్రపోజల్ పెట్టగా అందుకు త్రిష ఒప్పుకోలేదట. ఆ డేట్ లో తప్ప తాను మరే రోజున కూడా మీడియా మీట్ కు రాను అంటూ తెగేసి చెప్పిందట. ఇలా త్రిష వ్యవహారం ఉండటంతో నీకిది న్యాయమా అంటూ నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Please Read Disclaimer