గడ్డిలో కూర్చున్న గార్జియస్ బ్యూటీ

0

బాలీవుడ్ అంటేనే హాటు బ్యూటీలకు కేరాఫ్ అడ్రెస్. ఒకరిని మించి మరొకరు అన్నట్టుగా గ్లోబల్ వార్మింగ్ కు తమవంతు సహకారం అందిస్తారు. ఈ హాటు భామలు ఎవరైనా సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఫోటోలు పోస్ట్ చేస్తే నెటిజన్లు వెర్రెత్తిపోతారు. వాటికి లక్షల్లో లైక్స్.. వేలల్లో కామెంట్స్ వచ్చేస్తాయి. తాజాగా పరిణీతి చోప్రా అదేపని చేసింది.

పరిణీతి ప్రస్తుతం గోవాలో ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. అక్కడ తీయించుకున్న ఫోటోను ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేసింది. ఆ ఫోటోకు “నవ్వుతూ ఉండు బేబీ.. నవ్వుతూనే ఉండు” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. మంచి మెసేజ్ కదా.. నవ్వడం కంటే అందమైన విషయం ఈ ప్రపంచంలో ఏదీ ఉండదు. జనాలు ఫ్రీగా దొరికే నవ్వును మర్చిపోయి డబ్బుతో కొనుక్కుంటే కానీ రాని టెన్షన్ పై ఫోకస్ చేస్తారు! సరే.. ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి కాబట్టి దాన్ని వదిలేసి పరిణీతి ఫోటో గురించి మాట్లాడుకుంటే లైట్ బ్లూ కలర్ శాటిన్ గౌన్ ధరించి గడ్డిలో కూర్చుని ఆహ్లాదకరంగా నవ్వుతూ ఉంది. స్లీవ్ లెస్.. షార్ట్ గౌన్ కావడంతో పరిణీతి సూపర్ డూపర్ హాట్ గా ఉంది. స్కిన్ కలర్ ఆ షైన్ చూస్తే ‘పట్టు పట్టు’ అనే పట్టులాంటి యాడ్ గుర్తురావాల్సిందే.

ఈ ఫోటోలకు నెటిజన్ల రెస్పాన్స్ కూడా అదిరిపోయింది. “స్వీటెస్ట్ ఎవర్ స్మైల్”.. “క్యూట్ ఏంజెల్”.. “స్కిన్ లో గ్లో ఉంది” అంటూ కామెంట్లు పెట్టారు. ఇక పరిణీతి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ‘సందీప్ ఔర్ పింకీ ఫరార్’.. ‘భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’.. ‘ది గర్ల్ ఆన్ ది ట్రైన్’ చిత్రాల్లో నటిస్తోంది.
Please Read Disclaimer