అక్క గ్లోబల్ అయితే చెల్లి లోకల్

0

బాలీవుడ్ సినిమాలను ఫాలో అయ్యేవారికి పరిచయం ఉండే పేరు పరిణీతి చోప్రా. గ్లోబల్ సుందరి ప్రియాంక చోప్రాకు ముద్దుల కజిన్. ఈ భామ ఖాతాలో మంచి హిట్లే ఉన్నాయి. ఈ భామ మొదట్లో కాస్త బొద్దుగానే ఉండేది కానీ ఈమధ్య మాత్రం పర్ఫెక్ట్ బాలీవుడ్ బ్యూటీ లాగా కసరత్తులు చేసి అన్ని రకాల డైట్లు ఫాలో అయ్యి జీరో సైజ్ కు మారిపోయింది. ఇక సోషల్ మీడియాలో మంటలు పెట్టడంలో అక్క ప్రియాంకకు ఏమాత్రం తీసిపోదు.

తను స్వయంగా కొన్ని ఫోటోలను పోస్ట్ చేసి నెటిజన్లను కాల్చుకు తింటుంది. అవి మాత్రమేలే అని నెటిజన్లు సరిపెట్టుకోలేరు. ఎందుకంటే ఈ భామ బయట జిమ్ము దగ్గరో.. లేక ఒక రెస్టారెంట్ దగ్గరో కనిపిస్తే బాలీవుడ్ చకోర పక్షులు అయిన ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీసేస్తారు.. వాటిని సోషల్ మీడియాలో పెట్టేస్తారు. రీసెంట్ గా అలానే జరిగింది. పరిణీతి బయటకు రావడం.. కెమెరాల కంటికి చిక్కడం అనే పరిణామాలు చకచకా జరిగిపోయాయి. ఈ ఫోటోలలో పరిణీతి స్టైల్ ను చూస్తె ఎవరైనా ఫిదా కావాల్సిందే. బ్లూ కలర్ టాప్.. ఆలివ్ గ్రీన్ స్కిన్ టైట్ ప్యాంట్ ధరించి నాభి అందాలను కెమెరాలకు వడ్డిస్తూ.. చిరునవ్వులు రువ్వుతూ ఎంచక్కా నడుచుకుంటూ వెళ్ళింది. పోనీ టెయిల్.. కళ్ళకేమో సూపర్ స్టైలిష్ గాగుల్స్ ధరించి మోడరన్ అప్సరస లాగా కనిపిస్తోంది.

ఇక సినిమాల విషయానికి వస్తే పరిణీతి ప్రస్తుతం ‘సందీప్ ఔర్ పింకీ ఫరార్’.. ‘ భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’.. ‘ది గర్ల్ ఆన్ ది ట్రైన్’ చిత్రాల్లో నటిస్తోంది. ఈ సినిమాలలో మొదటగా రిలీజ్ కానున్న చిత్రం ‘సందీప్ ఔర్ పింకీ ఫరార్’. యశ్ రాజ్ ఫిలిమ్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో హీరో అర్జున్ కపూర్. దర్శకుడు దిబాకర్ బెనర్జీ.
Please Read Disclaimer