బ్లాక్ శారీలో ప్యూర్ మ్యాజిక్

0

బాలీవుడ్ లో ఉండే హాట్ బ్యూటీలలో పరిణీతి చోప్రా ఒకరు. గ్లోబల్ సుందరి ప్రియాంకకు కజిన్ ఈ పరిణీతి. లుక్స్.. హాట్ నెస్ లో అక్కగారికి ఏమాత్రం తీసిపోరు ఈ చెల్లిగారు. నటన కూడా డీసెంటే. పరిణీతి ఖాతాలో మంచి హిట్ సినిమాలు కూడా ఉన్నాయి. ఇక సోషల్ మీడియా తాట తీయడంలో అక్కదగ్గర ఫుల్ గా ట్రెయినింగ్ తీసుకుందేమో కానీ నెటిజన్లను ప్రాణాలను అవలీలగా తీస్తుంది.

సాధారణంగా ఈభామ మోడరన్ డ్రస్సుల్లోనే ఉంటుంది కానీ దీపావళి సదర్భంగా ట్రెడిషనల్ గా చీరకట్టింది. చక్కగా అలంకరించుకుని ఫోటోలు తీయించుకుంది. ఆ ఫోటోలను తన ఇన్స్టా ఖాతాద్వారా పోస్ట్ చేస్తూ “చీర.. చీర కాదు. దీపావళి శుభాకాంక్షలు. ఈసారి చీర కట్టుకుందామనుకున్నా. ఎంజాయ్ చేశా” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. బ్లాక్ కలర్ డిజైనర్ శారీ.. బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించింది. పర్ఫెక్ట్ మేకప్.. లైట్ బ్రౌన్ కలర్ లిప్ స్టిక్.. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ధరించి ఖజురహో శిల్పంలా నిలుచుంది. ఎంతకాలం ఈ ఖజురహో శిల్పాలతో రెగ్యులర్ రొటీన్ పోలికలు.. మొన్నే కాసర్ల శ్యామ్ గారు ‘సిల్కు చీర కట్టుకోని చిల్డు బీరు మెరిసినట్టు’ అని కొత్త పదప్రయోగం చేశారు కదా.. పరిణీతి సరిగ్గా ఆ లెక్కనే ఉంది..!

ఈ ఫోటోలకు నెటిజన్ల రెస్పాన్స్ కూడా అదిరిపోయింది. “బ్లాక్ స్వాన్”.. “చీరలో రాయల్ లుక్ ఉంది”.. “హాటెస్ట్ బ్లాక్ శారీ” అంటూ కామెంట్లు పెట్టారు. ఇక పరిణీతి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ‘సందీప్ ఔర్ పింకీ ఫరార్’.. ‘భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’.. ‘ది గర్ల్ ఆన్ ది ట్రైన్’ చిత్రాల్లో నటిస్తోంది.
Please Read Disclaimer