ప్చ్ ! గాయం అయితే వీపు షో ఎందుకు?

0

ఆ గాయం చూశాక అభిమానుల కు రెండు సందేహాలు. ఆ మెడ చుట్టూ బులుగు ప్లాస్టర్ వేసిన విధానం చూస్తుంటే అయ్యయ్యో! అనకుండా ఉండ లేరు. అలాగని గాయం ఒక్కటే చూపించకుండా వీపంతా చూపించేస్తే ఎలా? అంటూ సందేహం కూడా వెంటాడొచ్చు. ఉలిపిరి కట్ట.. ఉప్పు చేప.. పప్పు చారు కాదేదీ ప్రచారానిక నర్హం! అన్న చందంగా ఉందీవిడ వ్యవహారం.

ఏంటిది పారీ.. ఎందుకిలా చేశావ్? అంటూ ఫ్యాన్స్ మల్ల గుల్లాలు పడి పోతున్నారు సుమీ. వీపు చూడు వీపందం చూడు! అంటూ ఎంత సక్కంగా సూయించింది ఆ వీపందం? పైగా బులుగు ప్లాస్టర్ కి కాంబినేషనా అన్నట్టు ఆ నీలి రంగు లోదుస్తులతో ఎందుకలా కవ్విస్తోంది అన్నది లా పాయింట్!! మొన్నటివరకూ ఎలాంటి కష్టాలు లేకుండా ఆస్ట్రేలియా న్యూజిల్యాండ్ అంటూ ప్రపంచం లో ఉన్న సుందరమైన ఐల్యాండ్స్ ని చుట్టేసి వచ్చింది. ఆస్ట్రేలియా లో కంగారూల్ని పలకరించి వచ్చింది.

ప్రస్తుతం బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ బయోపిక్ కోసం నానా తంటాలు పడుతోంది. సైనా ఎన్ని సలహాలు ఇచ్చినా ఎంత ట్రైనింగ్ తీసుకున్నా గాయాలు తప్పడం లేదు పాపం పారీ అలియాస్ పరిణీతి కి. `బుల్ షిట్.. హ్యాపెన్స్“ అంటూ తనకు అయిన గాయాన్ని చూపిస్తూ ఇలా ఫోటో ని ట్విట్టర్ లో షేర్ చేసింది. బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ అంటే ఆషామాషీనా? చాలా జాగ్రత్తలు పాటించాలి. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఊహించని రీతిలో గాయాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయినా ఆ గాయం మెడ పైనే ఎందుకు అవ్వాలి? దానికి ఇంత పబ్లిసిటీ ఎందుకు చేయాలి? అంటే అది అభిమానులే ఊహించుకోవాలి. మొత్తానికి సైనా బయోపిక్ కి బోలెడంత ఉచిత పబ్లిసిటీ తెచ్చేస్తోంది పారీ. ప్రస్తుతం గాయం నుంచి కోలుకునేందుకు విశ్రాంతి తీసుకుంటోందట.

రిలాక్స్ అవ్వగానే తిరిగి ప్రాక్టీస్ మొదలు పెట్టేస్తానని చెబుతోంది. దానికి ఇంకో 30రోజులు వేచి చూడాలట. 31 వయసు పరిణీతి కి గాయం అయినా కోలుకోవడం సులువే కానీ.. ఇప్పుడిలా అనవసరంగా వాయిదాల ఫర్వంలో షెడ్యూల్స్ నే మార్చాల్సి వస్తోంది మరి. అమోల్ గుప్తే దర్శకత్వం లో టీసిరీస్ భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Please Read Disclaimer