యూరప్ సరస్సును అన్నపూర్ణకు తెచ్చిన జాన్!!

0

ప్రభాస్ ‘సాహో’ తర్వాత చేస్తున్న చిత్రంపై ప్రేక్షకుల్లో మరియు ఫ్యాన్స్ లో రోజు రోజుకు ఆసక్తి పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. 1980 కాలంకు చెందిన యూరల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెల్సిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంను దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా దర్శకుడు రాధాకృష్ణ ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రభాస్ కు ఉన్న రేంజ్ నేపథ్యం లో ఎక్కడ లైట్ తీసుకోకుండా ప్రతి చోట భారీతనం కనిపించేలా సినిమా మేకింగ్ చేస్తున్నారు.

యూరప్ లో ఒక సరస్సు వద్ద కొన్ని సీన్స్ ను షూట్ చేయాల్సి ఉందట. అయితే ఆ సీన్స్ కోసం మళ్లీ యూరప్ ను మొత్తం యూనిట్ తీసుకు వెళ్లడం చాలా కష్టంతో కూడుకున్న పని. అందుకే అన్నపూర్ణ స్టూడియో లో యూరప్ కు చెందిన ఒక సరస్సు సెట్ ను అత్యంత సహజంగా కనిపించేలా డిజైన్ చేశారట. పరిసరాలు మరియు వాతావరణం అంతా కూడా యూరప్ లో ఉన్నామా అన్నట్లు గా ఆ సెట్టింగ్ ను డిజైన్ చేసినట్లుగా చూసిన వారు అంటున్నారు.

ప్రస్తుతం అక్కడ షూటింగ్ జరుపుతున్న యూనిట్ సభ్యులు ఆ వెంటనే రామోజీ ఫిల్మ్ సిటీలో కీలక సన్నివేశాల చిత్రీకరణకు వెళ్లబోతున్నారట. ఈ చిత్రం కోసం ప్రభాస్ విరామం లేకుండా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. తెలుగు మరియు హిందీ వర్షన్ లకు వేరు వేరుగా కొన్ని సీన్స్ ను చిత్రీకరిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

కృష్ణం రాజు కీలక పాత్రలో కనిపించబోతుండగా హిందీ వర్షన్ కు గాను మిథున్ చక్రవర్తి అదే పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. సాహో కాస్త నిరాశ పర్చినా ఇది మాత్రం ఖచ్చితంగా బాహుబలి మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందని.. బాహుబలి 1 ను క్రాస్ చేసే వసూళ్లను దక్కించుకుంటుందని ప్రభాస్ ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.
Please Read Disclaimer